Megastar Chiranjeevi: లండన్‌ వీధుల్లో విహ‌రిస్తున్న మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మ‌రో కొత్త ఫోటో

Megastar Chiranjeevi: లండన్‌ వీధుల్లో విహ‌రిస్తున్న మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి మ‌రో కొత్త ఫోటో

ప్రస్తుతం మెగా‌స్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తన ఫ్యామిలీతో కలిసి లండన్‌కు వెళ్లిన విషయం తెలిసిందే. తన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, మనవరాలు క్లీంకారతో కలిసి సరదాగా లండన్‌లో విహరిస్తున్న ఫోటోను ఇటీవలే పంచుకోగా ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ నేపథ్యంలో లండ‌న్ వీధులలో విహ‌రిస్తున్న మ‌రో ఫోటోగ్రాఫ్ ని తాజాగా చిరు పంచుకున్నారు.

ఈ తాజా ఫోటోగ్రాఫ్ లో చిరు, చ‌ర‌ణ్ ఎంతో కూల్ స్టైలిష్ గా క‌నిపిస్తున్నారు. ఆ ఇద్ద‌రి డ్రెస్సింగ్ స్టైల్ ఎంతో సాఫ్టా గా..ఫార్మ‌ల్ గా క‌నిపిస్తున్నాయి. వారితో పాటు శ్రీ‌మ‌తి సురేఖ కొణిదెల‌, ఉపాస‌న కొణిదెల కూడా లండ‌న్ లో వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. లండ‌న్ ట్రిప్ నుంచి ఇంత‌కుముందే ఒక పాపుల‌ర్ హైడ్ పార్క్ నుంచి అంద‌మైన ఫోటో చిరు పంచుకోగా..ఇప్పుడు అదే లండ‌న్ వీధులలో విహ‌రిస్తున్న మ‌రో ఫోటో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ స్పెషల్ ట్రిప్ పారిస్ బెకాన్స్‌లో జరిగే ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో చిరు ఫ్యామిలీ పాల్గొనబోతున్నారు. నేడు జూలై 26 నుంచి ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా ఒలింపిక్ గేమ్స్ ప్రారంభం కానున్నాయి.  

ఏదేమైనా బిజీ స్టార్ డమ్ తో ఉన్న సమయంలో తమ ఫ్యామిలీతో ఇలా దేశాలను చుట్టేయడం చాలా బాగుందంటూ నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.  అయితే, ఈ ఫొటోస్ లో మెగా క్వీన్ క్లింకారా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ప్రస్తుతం చిరు ‘విశ్వంభర’లో నటిస్తున్నారు. మరోవైపు అగ్ర దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తోన్న ‘గేమ్ ఛేంజర్’ మూవీలో చెర్రీ పార్ట్ షూటింగ్ ఇటీవల పూర్తైంది.