ఏ హీరోకైనా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఉన్న స్పీడ్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఉండదు. కానీ చిరంజీవి రూటే వేరు. ఆయన స్పీడ్ చూసి మిగతా హీరోలంతా ఆశ్చర్యపోతున్నారు. రీ ఎంట్రీ ఇచ్చాక ఒకదాని తర్వాత ఒకటిగా సినిమాలు యాక్సెప్ట్ చేస్తుంటే ఆచితూచి అడుగులు వేస్తున్నారని అనుకున్నా రంతా. కానీ ‘సైరా’ తర్వాత వరుస సినిమాల్ని అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశారాయన. వాటిలో రెండు సినిమాలు ఈ సంవత్సరమే రాబోతున్నాయి. రామ్ చరణ్‌తో కలిసి కొరటాల శివ డైరెక్షన్‌లో నటించిన ‘ఆచార్య’ ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది. ఇక ‘గాడ్‌ఫాదర్’ కూడా ఇయర్ ఎండింగ్‌లోపు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. ఆ ప్లాన్‌తోనే శరవేగంగా షూటింగును కొనసాగిస్తున్నాడు దర్శకుడు మోహన్‌రాజా. ఆమధ్య కరోనా బారిన పడి ఐసొలేషన్‌లోకి వెళ్లిన చిరు.. పూర్తిగా కోలుకుని రీసెంట్‌గా షూట్‌లో తిరిగి జాయినయ్యారు. ఇక మెహర్ రమేష్ డైరెక్ట్ చేస్తున్న ‘భోళాశంకర్’ కూడా సెట్స్‌పై ఉంది. బాబి దర్శకత్వంలోనూ ఓ మూవీని పట్టాలెక్కించారు. దీనికి మొదట ‘వాల్తేర్ వీరయ్య’ అనే టైటిల్‌ను పరిశీలించారు. అయితే ఇప్పుడు దాన్ని ‘వాల్తేర్ మొనగాడు’గా మార్చబోతున్నారని తెలిసింది. వెంకీ కుడుములతో ఓ సినిమా లైన్లో ఉంది. మరోవైపు పదమూడేళ్ల తర్వాత యాడ్స్‌లో నటించడానికి కూడా ఆసక్తి చూపిస్తున్నారు చిరు. రీసెంట్‌గా ఓ యాడ్‌కి ఓకే చెప్పినట్లు టాక్. ఏదేమైనా ఇలా పర్‌ఫెక్ట్ ప్లానింగ్‌తో దూసుకుపోవడం మెగాస్టార్‌కే చెల్లింది.
మరిన్ని వార్తల కోసం..