కోర్ట్ మూవీ టీమ్ ని అభినందించిన మెగాస్టార్ చిరు.. ఎమోషనల్ అయిన శివాజి..

కోర్ట్ మూవీ టీమ్ ని అభినందించిన మెగాస్టార్ చిరు.. ఎమోషనల్ అయిన శివాజి..

ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న బడ్జెట్ తో వచ్చిన "కోర్ట్: స్టేట్ వర్సెస్ నో బడీ" సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమాలో వెటరన్ హీరో శివాజీ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ప్రియదర్శి లాయర్ పాత్రలో నటించి అదరగొట్టాడు. రోషన్, శ్రీదేవి, సాయి కుమార్ తదితరులు యాక్టింగ్ తో అలరించారు. అయితే ఈ సినిమా దాదాపుగా ఇప్పటివరకూ రూ.50 కోట్లు (గ్రాస్) పైగా కలెక్ట్ చేసింది. 

అయితే కోర్ట్ టీమ్ ని మెగాస్టార్ చిరంజీవి అభినందించాడు. దీంతో కోర్ట్ చిత్రంలో నటించిన యాక్టర్స్, దర్శకుడు రామ్ జాగదీష్, తదితరులు చిరంజీవి ని కలిశారు. ఇందులోభాగంగా చిరంజీవి నటుడు శివాజీ, ప్రియదర్శిని అప్రిషియేట్ చేశాడు. అలాగే తాను ఇటీవలే కోర్ట్ సినిమా చూశానని చాల అద్భుతంగా తీశారని ప్రసంశలు కురిపించాడు. నటుడు శివాజీ యాక్టింగ్ చాలా బాగా నచ్చిందని కితాబిచ్చాడు. దీంతో శివాజీ ఎమోషనల్ అయ్యాడు. తన లైఫ్ లో ఈ బెస్ట్ కాంప్లిమెంట్స్ అస్సలు మర్చిపోలేనని చెప్పుకొచ్చాడు. 

ALSO READ | మెక్సికోలో ప్రభాస్ స్పిరిట్ షూటింగ్.. ఆ హాలీవుడ్ హీరో కూడా వస్తున్నాడా.?

ఈ విషయం ఇలా ఉండగా  ప్రస్తుతం చిరంజీవి డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాని ప్రముఖ ప్రొడ్యూసర్ సాహూ గారపాటి నిర్మిస్తున్నాడు. ఆదివారం (మార్చ్ 30) ఈ సినిమా హైదరాబాద్ లోని రామా నాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుని స్టార్ట్ అయ్యింది. ఈ పూజా సెర్మనీకి టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిరుని విష్ చేశారు. ఈ ఏడాది ఆరంభంలో "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ సినిమాతో హిట్ ట్రాక్ కంటిన్యూ చెయ్యాలని తీవ్రంగా శ్రమిస్తున్నాడు.