నాగబంధం మూవీ ని లాంచ్ చేసిన మెగాస్టార్...

నాగబంధం మూవీ ని లాంచ్ చేసిన మెగాస్టార్...

టాలీవుడ్ ప్రముఖ సినీ నిర్మాత అభిషేక్ నామా మెగా ఫోన్ పట్టిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం అభిషేక్ నామా నాగబంధం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈరోజు (అక్టోబర్ 14) పలువురు సినీ ప్రముఖుల మధ్యన పూజా కార్యక్రమాలు నిర్వహించి ఘనంగా లాంచ్ చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా హాజరై మొదటి షాట్ కి క్లాప్‌బోర్డ్‌ కొట్టారు. 

ASLO READ | రూ.30 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసిన మలయాళీ సినిమా...

అయితే ఈ చిత్రాన్ని  భారతదేశంలోని పలు దేవాలయాలలోని సంపదని వెలికితీసే సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిస్తున్నారు. ఇక నటీనటుల విషయానికొస్తే పెద కాపు చిత్రంతో ఆకట్టుకున్న విరాట్ కర్ణ హీరోగా నటిస్తుండగా నభా నటేష్, ఈశ్వర్య మీనన్ తదితరులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అలాగే  జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ మరియు బి.ఎస్. ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

గతంలో ప్రముఖ స్టార్ హీరో కళ్యాణ్ రామ్ మరియు మలయాళీ బ్యూటీఫుల్ హీరోయిన్ సంయుక్త మీనన్ కలసి జంటగా నటించిన డెవిల్ చిత్రంతో తనలోని దర్శకత్వ ప్రతిభని నిరూపించుకున్నాడు అభిషేక్ నామా. అయితే ఈ చిత్రం భారీ హిట్ కాకపోయినప్పటికీ పలువురి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందాయి. దీంతో డైరెక్టర్ అభిషేక్ నామా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.