
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం(ఫిబ్రవరి 23) భారత్- పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. దుబాయి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమిస్తున్న ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ మొదట బ్యాటింగ్ చేస్తోంది. ఇప్పటివరకూ, 30 ఓవర్ల ఆట పూర్తి కాగా.. దాయాది జట్టు 2 వికెట్లు నష్టపోయి 129 పరుగులు చేసింది. రిజ్వాన్ (44 నాటౌట్), సౌద్ షకీల్ (39 నాటౌట్) నిలకడగా ఆడుతున్నారు.
ఇదిలావుంటే, ఈ హై వోల్టేజ్ పోరుకు సినీ హీరో మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. చిరు స్టాండ్స్‌లో కూర్చొని మ్యాచ్ చూస్తున్న దృశ్యాలు నెట్టింట ప్రత్యక్షమయ్యాయి. దుబాయ్‌లో బాస్.. అని మెగా అభిమానులు ఆ ఫోటోలను తెగ వైరల్ చేస్తున్నారు.
MEGASTAR CHIRANJEEVI IN THE STANDS FOR INDIA VS PAKISTAN. 🌟 pic.twitter.com/qKFa3RbgjG
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2025