Vishwambhara: విశ్వంభర విజృంభణం..త్రిశూలంతో రుద్రనేత్రుడిలా చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర(Vishwambhara). టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ వశిష్ట(Vassishta) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను.. యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. 

తాజాగా గురువారం ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా  విశ్వంభర నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. "చీకటి మరియు చెడు ప్రపంచాన్ని ఆక్రమించినప్పుడు, ఒక మాగ్నానిమస్ స్టార్ పోరాడటానికి ప్రకాశవంతంగా ప్రకాశిస్తుంది..విశ్వంభరతో మీ ప్రకాశాన్ని ప్రపంచాన్ని సాక్షులుగా చూడనివ్వండి..పుట్టినరోజు శుభాకాంక్షలు మెగాస్టార్" అంటూ టీమ్ విషెష్ తెలిపింది. 

Also Read:-ఆపద్బాంధవుడు అన్నయ్య..చిరాయుష్షుతో ఆరోగ్యవంతంగా జీవించాలి

ఈ పోస్టర్ లో ఒక కొండ మీద త్రిశూలంతో మోకాలి మీద మోకరిల్లినట్టు చిరంజీవి గంభీరంగా కనిపిస్తున్నారు. త్రిశూలంతో రుద్రనేత్రుడిలా కనిపిస్తున్నాడు చిరంజీవి. ఒక రకంగా ఈ పోస్టర్ తో మెగాస్టార్ ఫ్యాన్స్ కి కాస్తా ఉపశమనం కలిగించిన..టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే, చిరు బర్త్ డే స్పెషల్ గా టీజర్ వస్తుందని అంతా భావించారు. కానీ, , పోస్టర్ ట్రీట్ తోనే సరిపెట్టారు వశిష్ట. 

ఇందులో చిరంజీవి డ్యూయెల్ రోల్ చేస్తున్నారని,అందులో ఒకటి యంగ్‌‌‌‌ లుక్‌‌‌‌ కాగా,వయసు పైబడిన మరో పాత్రలో కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. సురభి,వెన్నెల కిషోర్, హర్షవర్ధన్,ప్రవీణ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న సినిమా విడుదల కానుంది.ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.