క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma) డైరెక్షన్లో వస్తోన్న లేటెస్ట్ మూవీ హనుమాన్ (Hanuman). భారతీయ ఇతిహాసాల్లోని హనుమంతుని కథ స్ఫూర్తితో ఇండియన్ తొలి ఒరిజినల్ సూపర్‌హీరో మూవీగా ఈ చిత్రం రానుంది.
యంగ్ హీరో తేజ సజ్జా కెరీర్లోనే బిగ్గెస్ట్ మూవీగా వస్తోన్న హనుమాన్ జనవరి 12న థియేటర్లోకి రాబోతుంది. దీంతో వరుస ప్రమోషన్లలో భాగంగా..ఈ నెల ఏడో తేదీన ప్రీ రిలీజ్ వేడుక జరగనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
ఈ గ్రాండ్ ఈవెంట్ హైదరాబాద్ మాదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ హాల్‌లో జరగనుంది. ఈ మెగా ప్రీ-రిలీజ్ ఉత్సవ్ (Mega Pre-Release Utsav)కు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని హీరో తేజా సోషల్ మీడియాలో అధికారికంగా పోస్ట్ చేస్తూ..హనుమాన్ కోసం నా గాడ్ ఫాదర్ వస్తున్నాడు అంటూ పోస్ట్ చేశాడు.
My #GodFather for our #HanuMan ❤️@PrasanthVarma @Primeshowtweets pic.twitter.com/9dyebsLNs5
— Teja Sajja (@tejasajja123) January 4, 2024
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లకు ఊహించని స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో త్వరలో జరగబోయే ఈ మెగా వేడుక ఏ రేంజ్ లో జరగనుందో అర్ధం చేసుకోవొచ్చు. ప్రేక్షకులు ఎక్కువగా సంక్రాంతి కానుకగా హనుమాన్ సినిమాని చూడాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.