Chiranjeevi: ఇల్లు లేడీస్ హాస్టల్ అయిపోయింది.. రామ్ చరణ్ ఈసారి కొడుకునే కనాలి: చిరంజీవి

Chiranjeevi: ఇల్లు లేడీస్ హాస్టల్ అయిపోయింది.. రామ్ చరణ్ ఈసారి కొడుకునే కనాలి: చిరంజీవి

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కొడుకును కనాలి అంటూ చిరంజీవి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ఇల్లంతా మానవరాళ్లతో నిండిపోయిందని.. ఇంట్లో ఉన్నప్పుడల్లా తనకు లేడీస్ హాస్టల్ వార్డెన్ లాగా ఉంటుందని అన్నారు చిరంజీవి. రామ్ చరణ్ కు కొడుకు పుట్టి తమ వారసత్వాన్ని కొనసాగించాలనే కోరిక ఉందని అన్నారు చిరంజీవి. బ్రహ్మానందం సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్లో పాల్గొన్న చిరంజీవి ఈ మేరకు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

చిరంజీవి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. మెగా లెగసీని కంటిన్యూ చేయడానికి రామ్ చరణ్ కి కొడుకు పుట్టాలని కొంతమంది ఫాన్స్ కామెంట్ చేస్తుంటే.. పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ మెగా లెగసీని కంటిన్యూ చేయడానికి పనికిరాడా అంటూ మరికొంతమంది ఫ్యాన్స్ వివాదాస్పద కామెంట్స్ చేస్తున్నారు. 

రామ్ చరణ్ తండ్రి అవ్వాలని మెగా ఫ్యామిలీ సహా అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చుసిన సంగతి తెలిసిందే.. పెళ్లైన 11ఏళ్ళ తర్వాత 2023లో రామ్ చరణ్ కూతురు క్లింకారా రాకతో అటు మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ ఎదురుచూపులకు తెరపడింది. మరి, మీడియా ముఖంగా తనకు మనవడు కావాలంటూ చిరంజీవి కోరిన కోరికను రామ్ చరణ్ నెరవేరుస్తాడా లేదా వేచి చూడాలి.