టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వెంకీ అట్లూరి డైరక్ట్ చేసిన లక్కీ భాస్కర్ బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ అయ్యింది. 1980స్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది.
ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి నటించారు. ఇందులో దుల్కర్ సల్మాన్ బ్యాంక్ ఉద్యోగిగా నటించగా, మీనాక్షి చౌదరి హౌజ్ వైఫ్ పాత్రలలో నటించి తమ పాత్రలకి చక్కగా న్యాయం చేశాడని చెప్పవచ్చు. లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ అయిన మొదటిరోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. దీంతో ఈ సినిమా ని చూసిన పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.
ALSO READ : సిటాడెల్ కోసం సమంత అన్ని కోట్లు తీసుకుందా..?
అయితే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ వెంకీ అట్లూరిని ఇంటికి పిలిచిమరీ అభినందించాడు. ఈ విషయాన్ని వెంకీ అట్లూరి సోషల్ మీడియా ద్వారా అభిమనులతో పంచుకున్నాడు. ఇందులో భాగంగా ఒకప్పుడు తాను మెగాస్టార్ సినిమాలు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసేవాడినని అలాంటిది ఇప్పుడు చిరంజీవి తనని ఇంటికి పిలిచి అభినందించడంతో చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. అలాగే మెగాస్టార్ తో పుష్ప గుచ్చం అందుకుంటున్న ఫోటోని కూడా షేర్ చేశాడు.