Megastar Chiranjeevi: తెలుగు రాష్ట్రాలకు చిరంజీవి భారీ విరాళం..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిప్లై

Megastar Chiranjeevi: తెలుగు రాష్ట్రాలకు చిరంజీవి భారీ విరాళం..డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రిప్లై

రెండు తెలుగు రాష్ట్రాల్లో వరదల కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలను ఆదుకునేందుకు తెలుగు సినీ ప్రముఖులు ఒక్కొక్కరుగా విరాళాలను ప్రకటిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  రెండు రాష్ట్రాలకు కలిపి రూ.కోటి విరాళం ప్రకటించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఎక్స్‌లో పోస్ట్‌ పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి చెరో రూ.50 లక్షలు ప్రకటించారు. 

తెలుగు రాష్ట్రాల్లో వరద ప్రభావం వల్ల ప్రజలకు కలిగిన, కలుగుతున్న కష్టాలు నన్ను కలిచివేస్తున్నాయి. పదుల సంఖ్యలో అమాయక ప్రాణాలు కోల్పోవడం ఎంతో విషాదకరం.తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్దేశంలో రెండు ప్రభుత్వాలు శాయశక్తులా పరిస్థితిని మెరుగు పరచడానికి కృషి చేస్తున్నాయి.మనందరం ఏదో విధంగా సహాయక చర్యల్లో పాలుపంచుకోవాల్సిన అవసరం వుంది.

ఈ ప్రక్రియలో భాగంగా రెండు రాష్ట్రాలలో ప్రజల ఉపశమనానికి తోడ్పాటుగా నా వంతు  కోటి రూపాయలు (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో 50 లక్షలు) విరాళంగా ప్రకటిస్తున్నాను.ఈ విపత్కర పరిస్థితులు తొందరగా తొలగిపోవాలని, ప్రజలంతా సురక్షితంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను" అని ట్విట్టర్ X ద్వారా తెలిపారు.

చిరు చేసిన సాయానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్పందిస్తూ..'ఆపద సమయంలో కూడా అన్నయ్య లాగా ఆదుకుని..మీ పెద్ద మనసు చాటుకున్నందుకు ధన్యవాదాలు అన్నయ్య' అని అన్నారు.

Also Read :- వరద బాధితులకు అండగా టాలీవుడ్

ఇప్పటికే చాలా మంది హీరోలు, ప్రొడ్యూసర్స్, హీరోయిన్స్  తమ వంతు బాధ్యతగా..ఆపదలో ఉన్న ప్రజల కోసం ముందుకొచ్చి ఆపన్న హస్తం అందించడంపై దేశవ్యాప్తంగా అభిమానుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.