టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ దక్కింది. దీంతో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చిరంజీవి ని దుశ్శాలువాతో సత్కరించి ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ అందించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వర రావు జ్ఞాపకార్థం అందించే ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ ని అమితాబ్ బచ్చన్ చేతులు మీదుగా అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే 15 ఏళ్ల క్రితం తాను పద్మ భూషణ్ అవార్డ్ అందుకున్న సమయంలో అమితాబ్ బచ్చన్ కింగ్ ఆఫ్ ది ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని అంటూ విష్ చేశారాని ఆ మాటని ఎప్పటికీ మర్చిపోలేనని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
ALSO READ | ANR National Award 2024: ఐసీయూలో ఉండగా ఏఎన్నార్ చివరి మెసేజ్.. వింటే కన్నీళ్ళాగవు..
ఇక 1990లో మెగాస్టార్ చిరంజీవి హిందీలో హీరోగా నటించిన ప్రతిబంద్ సినిమా చూసి అమితాబ్ బచ్చన్ తనని ఎంతగానో అభినందించారని తెలిపాడు. తనని సినిమా ఇండస్ట్రీలో ప్రభావితం చేసిన నటీనటులలో అమితాబ్ బచ్చన్ ఎప్పుడూ ముందుంటారని ఎమోషనల్ అయ్యాడు. ఇక ఇరువురి ఇళ్ళలో ఏదైనా సెలబ్రేషన్స్ లేదా అకేషన్స్ జరిగితే కచ్చితంగా హాజరై ఆశీస్సులు అందిస్తారని అమితాబ్ బచ్చన్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి చెపుకొచ్చాడు. అక్కినేని నాగార్జున అక్కినేని ఫౌండేషన్ ద్వారా చేస్తున్న మంచి పనులని అభినందించారు.