![Shankar Daughter: శంకర్ కుమార్తె ఐశ్వర్య రిసెప్షన్లో మెగా ఫ్యామిలీ సందడి..](https://static.v6velugu.com/uploads/2024/04/megastar-chiranjeevi-family-at-the-reception-of-shankar-daughter-photos-viral-in-social-media_5YUqLDTSJF.jpg)
తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) ఇంట పెళ్లి బాజాలు మోగాయి. రెండ్రోజుల క్రితం ఆయన పెద్దకూతురు ఐశ్వర్య శంకర్ (Aishwarya Shankar) వివాహం అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తీక్(Tharun karthik) తో జరిగింది. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు సినీ స్టార్స్ హాజరయ్యి వధూవరులను ఆశీర్వదించారు. ఈ వివాహనికి మణిరత్నం,సుహాసిని దంపతులతో పాటు చియాన్ విక్రమ్, కమల్ హాసన్, రజినీకాంత్, నయన్ ,విఘ్నేశ్ శివన్, సూర్య, కార్తీ , నరేశ్, ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు అటెండ్ అయ్యారు.
తాజాగా చెన్నై లో శంకర్ గ్రాండ్ రీసెప్షన్ ను ఏర్పాటు చేశారు. ఈ రిసెప్సన్ వేడుకలో కొత్త జంట బ్లూ డ్రెస్సులో మెరిశారు.ఈ స్పెషల్ ఈవెంట్‌కు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి-సురేఖ దంపతులతో పాటు రామ్ చరణ్-ఉపాసన కూడా హాజరయ్యారు. అలాగే విజయ్ సేతుపతి, జయం రవి, మోహన్‌లాల్, రన్‌వీర్‌సింగ్, శివకార్తీకేయన్ కపుల్, కాజల్-గౌతమ్ కిచ్లూ, రకుల్ ప్రీత్ సింగ్, లోకేశ్ కనగరాజ్, బోనీకపూర్, జాన్వీకపూర్, నెల్సన్ దిలీప్ కుమార్, అనిరుధ్ రవిచందర్ లు అటెండ్ అయ్యి ఎంజాయ్ చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోస్ వైరల్ అవుతున్నాయి. ఇక వరుడు తరుణ్ కార్తీక్ విషయానికి వస్తే.. చాలా కాలంగా ఆయన శంకర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. శంకర్ కుమార్తె ఐశ్వర్య కు ఇది రెండవ వివాహం. ఇంతకు ముందే ఆమెకు క్రికెటర్ రోహిత్ తో 2021లో పెళ్లి జరిగింది. కానీ, కొన్ని అనివార్య కారణాల వల్ల పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు.
#Shankar Daughter Wedding Reception 😀
— Sugumar Srinivasan (@Sugumar_Tweetz) April 16, 2024
Grand reception happened at Chennai 💥#Ramcharan | #Chiranjeevi | #Vijaysethupathi | #KajalAggarwal | #RakulPreetSingh | #Arrahman pic.twitter.com/hxI4gPbCff