టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాని ప్రముఖ సినారె నిర్మాత సుధాకర్ చెరుకూరి, నేచురల్ స్టార్ నాని ఇద్దరూ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ని అధికారంగా ప్రకటించారు. ఈ సినిమాని 90స్ లో హైదరాబాద్ కి చెందిన ఓ గ్యాంగ్ స్టార్ రియల్ లైఫ్ స్టోరీ, పీరియాడిక్ డ్రామా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కించేందుకు శ్రీకాంత్ ఓదెల స్టోరీ సిద్ధం చేసుకున్నాడు.
టాలీవుడ్ సైన్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరు రూ.75 కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మేకర్స్ పూర్తి రెమ్యునరేషన్ చిరంజీవికి ఇచ్చేశారని, ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల నాని సినిమా షూటింగ్ లో బిజిగా ఉండటంతో త్వరలోనే చిరు సినిమా కూడా పట్టాలెక్కే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే చిరంజీవి 150కి పైగా సినిమాల్లో హీరోగా నటించాడు. అలాగే మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ప్రోగ్రాం కి హోస్ట్ గా కూడా చేశాడు. కానీ ఇంత పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకోవడం ఇదే మొదటిసారి.
ALSO READ | GameChanger: గేమ్ ఛేంజర్ కోసం రామ్ చరణ్, శంకర్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత?
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తెలుగులో విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్ వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణవల్ల సమ్మర్ కి వాయిదా పడింది.