మెగాస్టార్ చిరంజీవికి చికున్ గున్యా

మెగాస్టార్ చిరంజీవికి చికున్ గున్యా

 మెగాస్టార్‌ చిరంజీవి అనారోగ్యానికి గురి అయ్యారు. గత 25 రోజులుగా ఆయన చికున్ గున్యాతో బాధపడుతున్నారు. తాజాగా గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చిరంజీవికి చోటు దక్కడంతో హైదరాబాద్‌లో ఇవాళ (సెప్టెంబర్ 22) అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. గిన్నిస్‌ బుక్‌ ప్రతినిధులు, బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ కలిసి మెగాస్టార్‌కు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ సర్టిఫికేట్ అందించారు. చికున్ గున్యాతో బాధపడుతున్నప్పటికీ ఆయన గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ వారి పిలుపు మేరకు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. స్టేజ్‌ మీదకు వెళ్తున్న సమయంలో కూడా హీరో సాయి ధరమ్‌తేజ్‌ చిరుకు సాయంగా వెళ్లాడు.

కాగా, మెగాస్టార్ చిరంజీవి నట ప్రస్థానంలో మరో అరుదైన గౌరవం దక్కిన విషయం తెలిసిందే. సినీ రంగ చరిత్రలోనే అత్యధిక పాటలకు డ్యాన్సులు వేసిన తొలి వ్యక్తిగా ప్రతిష్టాత్మక గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్స్‎లో మెగాస్టార్‎ స్థానం సంపాదించుకున్నారు. మొత్తం 156 సినిమాల్లో 537 పాటలకు 24,000 డ్యాన్స్ మూవ్స్ చేసినందుకుగానూ మెగాస్టార్ పేరు గిన్నిస్ రికార్డులోకెక్కింది. హైదరాబాద్‎లోని ఐటీసీ కోహినూర్‎లో ఇవాళ (సెప్టెంబర్ 22) అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. బాలీవుడ్ స్టార్ హీరో, మిస్టర్ ఫర్‎ఫెక్ట్ అమీర్ ఖాన్, గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డు సంస్థ ప్రతినిధులు మెగాస్టార్‎కు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సర్టిఫికేట్‎ను అందజేశారు.