చిరంజీవి ఇంట్లో మెగా సెలబ్రేషన్స్

పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు మెగాస్టార్ చిరంజీవి ఘన స్వాగతం పలికారు. 2024, జూన్ 4వ తేదీ గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని చిరంజీవి నివాసానికి తన భార్య, కొడుకుతో కలిసి పవన్ వెళ్లారు. ఈ  సందర్భంగా పవన్ కు మెగా ఫ్యామిలీ  గ్రాండ్ వెల్ కమ్ చెప్పింది. 

ఎమ్మెల్యే గా గెలిచాక తొలిసారి పవన్, చిరంజీవి దగ్గరకు వచ్చారు. పవన్ కు పూలమాల వేసి గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు చిరంజీవి.  కేక్ కట్ చేసి మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకున్నారు.  జనసేన కార్యకర్తులు, అభిమానులు పెద్ద ఎత్తున చిరంజీవి నివాసానికి చేరుకుని టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్నారు. ఈ  సెలబ్రేషన్స్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది.

జూన్ 4వ తేదీ మంగళవారం వెలువడిన ఏపీ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ 100 శాతం స్ట్రైక్ రేటుతో పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్ సభ స్థానాల్లో ఘన విజయం సాధించింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఈ ఎన్నికల్లో 164 అసెంబ్లీ స్థానాలతోపాటు 21 ఎంపీ సీట్లను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కూటమి విజయంలో పవన్ కల్యాణ్ కీలక పాత్ర పోషించారు.