దసరా దర్శకుడికి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్!

దసరా దర్శకుడికి మెగాస్టార్  గ్రీన్ సిగ్నల్!

మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్స్‌‌‌‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కథకు ప్రాధాన్యత ఉంటే అనుభవాన్ని కూడా లెక్క చేయడం లేదు. ఇప్పటికే వశిష్ట డైరెక్షన్‌‌‌‌లో  ‘విశ్వంభర’ చేస్తున్న చిరంజీవి.. తాజాగా మరో యువ దర్శకుడు చెప్పిన స్టోరీ లైన్‌‌‌‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. నానితో ‘దసరా’ చిత్రం తీసి సూపర్ హిట్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరు నటించడానికి ఒప్పుకున్నారని తెలుస్తోంది. 

ప్రస్తుతం నానితో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు శ్రీకాంత్. ఇది పూర్తయిన వెంటనే తన మూడో సినిమాగా మెగాస్టార్‌‌‌‌‌‌‌‌ను డైరెక్ట్ చేసే చాన్స్ రావడం పట్ల హ్యాపీగా ఫీలవుతున్నాడట. అలాగే చిరంజీవి కూడా ‘విశ్వంభర’ తర్వాత మరో మూవీని కంప్లీట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. దాని తర్వాత శ్రీకాంత్‌‌‌‌తో వర్క్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట. చిరంజీవి కూతురు సుష్మిత  నిర్మాతగా గోల్డ్ బాక్స్ బ్యానర్‌‌‌‌‌‌‌‌లో ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు సమాచారం. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌‌‌‌మెంట్ రావాల్సి ఉంది.