Megastar Chiranjeevi: గిన్నిస్ రికార్డుకు చిరంజీవికి ప్రత్యేక అనుబంధం.. ఆ ఆసక్తికర విషయాలేంటో చూడండి

Megastar Chiranjeevi: గిన్నిస్ రికార్డుకు చిరంజీవికి ప్రత్యేక అనుబంధం.. ఆ ఆసక్తికర విషయాలేంటో చూడండి

మెగాస్టార్‎ చిరంజీవి(Megastar Chiranjeevi) కి గిన్నిస్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్(Guinness World Records)‎లో చోటు దక్కిన విషయం తెలిసిందే. 156 సినిమాలు,537 పాటలు, 24 వేల స్టెప్పులతో అలరించినందుకు చిరంజీవికి ఈ రికార్డ్ దక్కింది.

టాలీవుడ్‎తో పాటు భారత సినీ చరిత్రలో తన ఆట, పాట, యాక్షన్‎తో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నందుకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో ఆదివారం (సెప్టెంబర్ 22న) చోటు దక్కించుకున్నారు చిరంజీవి. 

అయితే, ఇక్కడ మరోక ఆసక్తికర విషయం కూడా చోటుచేసుకుంది. అదేంటంటే..1955 లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ స్థాపించి మొదట పబ్లిష్ జరిగింది ఆగస్టులోనే. అంతేకాకుండా చిరంజీవి కూడా అదే సంవత్సరం 1955 ఆగస్టులోనే పుట్టడం విశేషం. అలాగే మరొక విశేషం కూడా ఉన్నది..22 సెప్టెంబర్ 1978 లో తన మొదటి సినిమా ప్రాణం ఖరీదు రిలీజయిన డేట్ కూడా ఇదే కావడం గమనార్హం. 

Also Read:-ఎమోషనల్ వీడియో షేర్ చేసిన జాన్వీ కపూర్

గిన్నిస్ రికార్డ్ మొదలు పెట్టిన సంవత్సరం, అదే నెలలో చిరంజీవి పుట్టడం, తన మొదటి సినిమా రిలీజయిన డేట్ కి 46 ఏళ్ళ తర్వాత గిన్నిస్ రికార్డ్ అందుకోవడం.. ఇలా అనుకోకుండా గిన్నిస్ రికార్డుకు మెగాస్టార్ చిరంజీవికి ఏదో అనుబంధం ఉందంటూ మెగా ఫ్యాన్స్, నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 

ఇకపోతే..గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో  చోటు దక్కించుకున్న  మెగాస్టార్ చిరంజీవికి సినీ,రాజకీయ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.