తెలుగు చలన చిత్ర పరిశ్రమలో 150 కి పైగా చిత్రాల్లో హీరోగా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి గురించి తెలియని వారుండరు. చిరు సినిమాల్లో హీరోగా మాత్రమే కాకుండా సినిమా ఇండస్ట్రీలో ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చినా, సహాయం అవసరమైనా తనవంతుగా ఎదో ఒకరూపంలో సహాయం చేస్తుంటాడు.
పలు తెలుగు చిత్రాల్లో చిన్నాచితకా పాత్రల్లో నటిస్తున్న ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. ఈ క్రమంలో వైద్యం నిమిత్తం ఆర్ధిక సహాయం కోసం దాతల కోసం ఎదురుచూస్తున్నాడు. దీంతో తాజాగా మీడియా ద్వారా ఫిష్ వెంకట్ అనారోగ్య సమస్య గురించి తెలుసుకున్న చిరు వెంటనే స్పందించినట్లు సమాచారం. ఇందులో భాగంగా అపోలో హాస్పిటల్స్ ద్వారా ఫిష్ వెంకట్ ట్రీట్మెంట్ కి కావాల్సిన సహాయం అందిస్తానని చెప్పారట . అంతేగాకుండా ఎప్పటికప్పుడు ఫిష్ వెంకట్ ఆరోగ్యం గురించి హాస్పిటల్ సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారట.
ALSO READ | AP/TG Floods: మానవత్వం చాటుకొన్న హీరో శింబు..కోలీవుడ్ నుంచి విరాళం ఇచ్చిన మొదటి హీరో
అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, ఖమ్మం జిల్లాలలో వరదలు వచ్చి పలు ఆస్తినష్టం జరగడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు విరాళంగా ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా మెగాస్టార్ చిరంజీవి రియల్ హీరో అంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.