మెగాస్టార్ చిరు సినిమా రీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా..?

మెగాస్టార్ చిరు సినిమా రీ రిలీజ్ వాయిదా..  కారణం అదేనా..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 1997లో హిట్లర్ అనే సినిమాలో నటించాడు. ఈ సినిమాని మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి హీరోగా నటించిన హిట్లర్ సినిమా నుచి ఇదే టైటిల్ తో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఐదుగురు చెల్లెళ్లకి అన్నగా చిరు నటించగా ప్రముఖ సీనియర్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించాడు. ఒకప్పటి మ్యూజిక్ డైరెక్టర్ కోటి సంగీతం అందించాడు. 

హిట్లర్ సినిమాని జనవరి 1న రిలీజ్ చేస్తున్నట్లు ఇటీవలే మేకర్స్ ప్రకటించారు. అంతేగాకుండా బుక్ మై షోలో టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. దీంతో 4కే వెర్షన్ ని ఎడిటింగ్ చేస్తున్నారు. కానీ  అనుకోకుండా ఎడిటింగ్ పనులు పూర్తీకాకపోవడంతో అనుకున్న సమయానికి హిట్లర్ సినిమా రిలీజ్ కావడం లేదని మేకర్స్ తెలిపారు. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. 

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మెగాస్టార్ చిరు విశ్వంభర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాలవల్ల వచ్చే ఏడాది సమ్మర్ కి వాయిదా పడింది. ఈ ఇక ఈ సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయానికొస్తే వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తుండగా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు.