
విశాఖపట్నంలోని లోకనాయక్ ఫౌండేషన్(Lokanayak Foundation) ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు అభిమాన నటుడు ఎన్టీఆర్ 28వ వర్ధంతి, దాదాసాహెబ్ పురస్కార గ్రహీత ఏఎన్నార్ 100 ఏళ్ల సెంటినరీ సెలబ్రేషన్స్ ఇవాళ (జనవరి 20) ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ నటుడు మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) హాజరయ్యారు.
'లోక్ నాయక్ ఫౌండేషన్..ఇది గొప్ప సాహితీ వేత్తలను గుర్తించి వారిని గౌరవించడానికి ఏర్పడిన సంస్థ. ఈ పురస్కారం ప్రతి ఏడాది ఒక ప్రముఖ తెలుగు రచయిత లేదా కవి లేదా తెలుగు సాహిత్యం కోసం సేవ చేసిన వ్యక్తికి ఇవ్వబడుతుంది.
ఈ పురస్కారాలను 2005 నుండి ప్రదానం చేస్తున్నారు. ఈ పురస్కారానికి ఎంపికైన వారికి లక్షా ఇరవై ఐదు వేల రూపాయల నగదు అందజేస్తారు.ఈ 2024 సంవత్సరంకి గాను ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్(Yandamuri Veerendranath)తో పాటు విల్సన్ సుధాకర్, రాధాకృష్ణంరాజు, రామసుబ్బారెడ్డిలకు పురస్కారాలు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిగా పాల్గొన్నచిరంజీవి తన బయోగ్రఫీ గురించి మాట్లాడుతూ..ప్రస్తుతం తన బయోగ్రఫీ రాసుకునే అంత టైం తనకి లేదని చెప్పారు. ఇక నా బయోగ్రఫీ రాసే బాధ్యత తెలుగులో ఎంతో గుర్తింపు పొందిన ఆధునిక కవుల్లో ఒకరైన యండమూరి వీరేంద్రనాథ్ కి అప్పగిస్తున్నాను. ప్రస్తుతం రచయితలలో యండమూరి భావజాలానికి ఎవరూ సాటి లేరు, ఆయన రాసిన అభిలాష సినిమాతోనే సినీ పరిశ్రమలో నా స్థానం పదిలం అని అపుడే ఫిక్స్ అయ్యాను. ఇప్పుడు నా బయోగ్రఫీ రాసే సమయం నాకు ఉండదు అందుకే ఈ బాధ్యతని యండమూరికి అప్పగిస్తున్నాను' అని చిరంజీవి వెల్లడించాడు. లోక్ నాయక్ ఫౌండేషన్ అధ్యక్షులు డా. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్.
MEGASTAR #Chiranjeevi garu Giving Lok Naik awards ?
— Chiranjeevi Army (@chiranjeeviarmy) January 20, 2024
Boss @KChiruTweets #Vishwambara #MegastarChiranjeevi pic.twitter.com/jggg3mRsqU
ప్రస్తుతం చిరు సినిమాల విషయానికి వస్తే..బింబిసారతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు వశిష్ట(Vassishta)తెరకెక్కిస్తున్న విశ్వంభర (Vishwambhara)మూవీలో నటిస్తున్నాడు. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read : Hanuman Movie: రూ.150 కోట్ల క్లబ్‌లో చేరిన హనుమాన్..సెకండ్ వీకెండ్ తగ్గేదేలే
పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం యూవీ క్రియేషన్స్ సంస్థ ఏకంగా రూ.150 కోట్లకు పైగాఖర్చు చేయనున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఆస్కార్ అందుకున్న ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు చోటా కె నాయుడు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు.