మెగాస్టార్ చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ పెద్దరికం పదవిలో తాను వుండనన్నారు. ఆ స్థానం తనకు వద్దంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే అవసరం వస్తే మాత్రం తప్పకుండా అక్కడ ఉంటానన్నారు. అయితే ఇండస్ట్రీ పెద్ద అనిపించుకోవడం తనకు వద్దన్నారు. ఇండస్ట్రీకి ఏ సమస్య వున్నా, కార్మికులకు ఏ సమస్యా వున్నా ఎప్పుడు ఆదుకోవడానికి సిద్ధంగా వుంటానన్నారు మెగాస్టార్. అయితే ఇద్దరు కొట్టుకొని పంచాయితీ చేయమంటే మాత్రం తాను చెయ్యనన్నారు చిరంజీవి. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అధ్వర్యంలో యోధ డయోగ్నస్టిక్ లైఫ్ టైం హెల్త్ కార్డులు పంపిణి కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెగాస్టార్.. పలు వ్యాఖ్యలు చేశారు. కరోనాతో చితికిన సినీ కార్మిక కుటుంబాలకు ఏదైనా చేయాలన్నదే తన అభిమతమన్నారు తెలుగు సినీ పరిశ్రమలో అన్ని విభాగాల సభ్యుల కుటుంబాలకు యోధా డయాగ్నిస్టిక్స్ ల్యాబుల్లో టెస్టులు, చికిత్సకు 50% రాయితీ ఇవ్వనున్నట్లు చెప్పారు. తన కోరిక మేరకు వెంటనే అంగీకరించిన యోధా డయాగ్నస్టిక్ యాజమాన్యానికి ఈ సందర్భంగా చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు. 50% రాయితీతో సినీ కార్మికులకు హెల్త్ కార్డులను అందించడం ఆనందంగా ఉందన్నారు చిరంజీవి.
కరోనా వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కరి లైఫ్ నీ అతలాకుతలం చేసిందన్నారు. కరోనా టైం లో ఇంటింటికీ వెళ్లి సీసీసీ వాళ్ళు నిత్యావసరాలు అందచేశారన్నారు చిరంజీవి. టెక్నికల్ తో కూడిన ఈ కార్డులో క్యూఆర్ కొడ్ వుంటుందన్నారు. దానిని బట్టి ఆకార్డుకి చెందిన వారి కుటుంబ సభ్యుల హెల్త్ కు సంబంధించి వివరాలు మొత్తం వుంటాయన్నారు. ప్రస్తుతం 18 యూనియన్లు కార్డులు రెడీ అయ్యాయన్నారు. దాదాపు 7700 కార్డులు తయారు అయ్యాయి మిగతావి ఈ నెలాఖరు లోపు రెడీ అవుతాయన్నారు చిరంజీవి. 50పర్సెంట్ రాయితీతో ఆ కార్డును వినియోగించుకోవచ్చన్నారు. ప్రతీ ఒక్కరూ ఈ కార్డును వినియోగించుకోవాలన్నారు. కార్మికులకు సంబంధించి ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎప్పుడూ అండగా ఉంటానన్నారు. సిని పరిశ్రమ అంతా తన కుటుంబ సభ్యులుగా భావిస్తున్నానన్నారు.
ఇవి కూడా చదవండి: