![లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరు.. థాంక్స్ చెప్పిన విశ్వక్.](https://static.v6velugu.com/uploads/2025/02/megastar-chiranjeevi-is-chief-guest-to-the-laila-movie-pre-release-event_xu3sbTW6aK.jpg)
టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా "లైలా". ఈ సినిమా ట్రైలర్ గురువారం రిలీజే కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే లైలా సినిమా ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి నూతన డైరెక్టర్ రామ్ నారాయణ్ దర్శకత్వం వహించగా, ప్రముఖ సినీ నిర్మాత సాహూ గారపాటి నిర్మించాడు.
లైలా సినిమా క్యాస్ట్ అండ్ క్రూ విషయానికొస్తే యంగ్ హీరోయిన్ ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటించగా వెటరన్ హీరో పృథ్వీ రాజ్, అభిమన్యు సింగ్, రవి మరియా, నాగినీడు, హర్ష వర్ధన్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యుని ప్రమోషన్స్ షురూ చేశారు.
అయితే విశ్వక్ సేన్ లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి వస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. శుక్రవారం విశ్వక్ సేన్ ప్రొడ్యూసర్ సాహూ గారపాటితో కలసి చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఇందులోభాగంగా చిరుని శాలువాతో సన్మానించారు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రమ్మని చెప్పగానే చిరు వెంటనే ఒప్పుకున్నారని చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.
ALSO READ | OTT New Movies: ఒకే ఓటీటీ ప్లాట్ఫామ్కి.. తండేల్, పట్టుదల సినిమాలు.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఈ విషయానికి సంబంధించిన ఫోటోలు కూడా షేర్ చేశాడు. "మా ఆహ్వానాన్ని మన్నించి మా లైలాకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన ఏకైక మెగా స్టార్ చిరంజీవి కొణిదెల గారికి ధన్యవాదాలు. సినిమాకు మీరు ఎల్లప్పుడూ బేషరతుగా మద్దతు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు." అంటూ క్యాప్షన్ పెట్టాడు. అయితే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 9న హైదరాబాద్ లో నిర్వహించనున్నారు.