Chiranjeevi: లండన్ చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి.. వెల్‍కమ్ అన్నయ్యా అంటూ ఫ్యాన్స్ సందడి

Chiranjeevi: లండన్ చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి.. వెల్‍కమ్ అన్నయ్యా అంటూ ఫ్యాన్స్ సందడి

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) లండన్‍కు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో అభిమానులు చిరుకు ఘనస్వాగతం పలికారు. రేపు (మార్చి 19,2025న) యునైటెడ్ కింగ్‌డమ్ పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌ చిరుని ఘనంగా సత్కరించనుంది.

ఈ నేపథ్యంలో (మార్చి 17న) లండన్‍లోని హీత్రో విమానాశ్రయంలో చిరంజీవి దిగారు. యూకేలోని చిరు అభిమానులు ఫ్లెక్సిలతో, కటౌట్స్తో వెల్‍కమ్ అన్నయ్యా అంటూ సందడి చేశారు. ప్రస్తుతం చిరు లండన్లో దిగిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో మెగా ఫ్యాన్స్లో కొత్త ఉత్సాహం మొదలైంది.  

బుధవారం (2025 మార్చి 19న) చిరంజీవికి యూకే పార్లమెంట్‌ జీవిత సాఫల్య పురస్కారం అందించనుంది. హౌస్ సభ్యులు ఆయనను సత్కరించనున్నారు. ఒక నటుడిగానే కాకుండా, సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా ఈ అవార్డును చిరు సొంతం చేసుకోనున్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో లేబర్ ఎంపీ నవేందు మిశ్రా హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ కార్యక్రమంలో యూకే పార్లమెంట్‌కు చెందిన గౌరవ సభ్యులు అటెండ్ అవ్వనున్నారు.

ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. బింబిసారా డైరెక్టర్ తెరకెక్కిస్తున్న 'విశ్వంభర' షూటింగ్ చివరి దశకు వచ్చింది. అలాగే, అనిల్ రావిపూడితో ఓ కామెడీ ఎంటర్‌టైనింగ్ లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ఫస్టాఫ్ డైలాగ్స్తో సహా లాక్ చేసేశాడు అనిల్. ఆ తర్వాత దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలాతో ఓ కల్ట్ మాస్ మూవీ చేయనున్నాడు. త్వరలో ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ నుంచి వరుస అప్డేట్స్ రానున్నాయి.