పారిస్ లో ఇటీవలే జరిగిన పారాలింపిక్స్ 2024లో మహిళల 400 మీటర్ల టీ20 క్లాస్‌లో వరంగల్ జిల్లా కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి జీవాంజి కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం నుంచి వచ్చినా ప్రతిభకి పెద్దరికం ఏమాత్రం అడ్డుకాదని దీప్తి జీవాంజి నిరూపించి ఎంతోమంది యువతకి ఆదర్శంగా నిలిచింది. దీంతో దీప్తి జీవాంజికి తెలంగాణ ప్రభుత్వం నుంచి భారీ నజరానా అందడంతోపాటూ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి.
అయితే శుక్రవారం పద్మ విభూషణ్, మెగాస్టార్ చిరంజీవి దీప్తి జీవాంజి ని ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అకాడమీలో కలిశాడు. ఈ సందర్భంగా దీప్తి జీవాంజి కి పుష్ప గుచ్చం అందజేశాయి దుశ్శాలువాతో సత్కరించాడు. అలాగే రూ.3 లక్షలు కానుకగా అందించాడు.
ALSO READ | షూటింగ్ పూర్తయిన 12 ఏళ్ళకి రిలీజ్ అవుతున్న విశాల్ సినిమా..
దీంతో ఈ విషయం గురించి పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ ప్రతిభని ఎంకరేజ్ చెయ్యడంలో మెగాస్టార్ ఎప్పుడూ ముందుటారని అలాగే ఆయన ఎంతోమంది అథ్లెట్స్ కి ఆదర్శమని అన్నాడు. దీప్తి చిరంజీవి ని కలవాలని చెప్పినప్పుడు స్వయంగా తానె వచ్చి కలుస్తానని మాటిచ్చారని, అనుకున్న విధంగానే దీప్తిని కలసి అభినందించడం చాలా సంతోషంగా ఉందని తెలిపాడు.
ఈ విషయం ఇలా ఉండగా ఇటీవలే తెలుగులో యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా ని టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, ప్రముఖ సినీ నిర్మాత సుధాకర్ చెరుకూరి కలసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి తెలుగులో విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరిలో పూర్తి కానుంది. దీంతో జూన్ లేదా జులై నెలలో శ్రీకాంత్ ఓదెల సినిమా షూటింగ్ ప్రారంభం కానున్నట్లు సమాచారం.