ప్రధానితో కలసి సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న మెగాస్టార్ చిరు..

ఢిల్లీలోని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మెగాస్టార్ చిరంజీవి,  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు తదితరులు పాల్గొన్నారు. చిరంజీవి పట్టు వస్త్రాల్లో కనిపించాడు. ఇందులోభాగంగా ప్రధాని మోదీకి  తెలుగు సంప్రదాయంలో డప్పు వాయుద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం తులసి చెట్టుకి పూజ చేసి వేడుకల్ని ప్రారంభించారు. 

ఈ వేడుకల్లో భాగంగా మోదీ గంగిరెద్దులకి చెరుకు తినిపించారు. అనంతరం భోగి మంటలు వెలిగించారు. మెగాస్టార్ చిరు, కిషన్ రెడ్డి తదితరులతో కలసి సాంస్కృతిక ప్రదర్శనలు చూస్తూ సరదాగా గడిపారు. అలాగే తెలుగు ప్రజలకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా, ప్రధాని మోదీ సోషల్ మీడియా ద్వారా ఈ వేడుకలకి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. 

"నా మంత్రివర్గ సహచరుడు శ్రీ జి. కిషన్ రెడ్డి గారి నివాసంలో జరిగిన సంక్రాంతి మరియు పొంగల్ వేడుకలకు హాజరయ్యాను. అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా చూశాను. భారతదేశం అంతటా ప్రజలు సంక్రాంతి పండగని గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. ఇది కృతజ్ఞత, సమృద్ధి మరియు పునరుద్ధరణ వేడుక. మన సంస్కృతి యొక్క వ్యవసాయ సంప్రదాయాలలో లోతుగా పాతుకుపోయింది. ప్రజలందరికీ నా సంక్రాంతి శుభాకాంక్షలు." అని ఎక్స్ లో ట్వీట్ చేశాడు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం చిరంజీవి తెలుగులో విశ్వంభర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి బింబిసార మూవీ ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తుది దశలో ఉంది.