
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నట ప్రస్థానంలో మరో అరుదైన గౌరవం దక్కింది. తెలుగు సినీ రంగంలో సుమారు 40 ఏళ్లకు పైగా ఆయన అందిస్తున్న విశేష సేవలను యూకే పార్లమెంట్ గుర్తించింది.
ఈ సందర్భంగా యూకే పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవిని సత్కరించనున్నారు. బుధవారం (2025 మార్చి 19న) ఈ అరుదైన గౌరవాన్ని చిరంజీవి అందుకోనున్నారు. అయితే, ఒక నటుడిగానే కాకుండా, సమాజంలో బాధ్యత గల వ్యక్తిగా ఈ అవార్డును చిరు సొంతం చేసుకోనున్నారు.
Also Raed : కిరణ్ అబ్బవరం లవ్ ఎంటర్‌టైనర్ ఎలా ఉందంటే?
ఈ క్రమంలో మెగా ఫ్యాన్స్తో సినీ వర్గాలు చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో లేబర్ ఎంపీ నవేందు మిశ్రా హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ కార్యక్రమంలో యూకే పార్లమెంట్‌కు చెందిన గౌరవ సభ్యులు అటెండ్ అవ్వనున్నారు.