Megastar Chiranjeevi: మరో ప్రతిష్ఠాత్మక అవార్డు సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏ విభాగంలో అంటే?

Megastar Chiranjeevi: మరో ప్రతిష్ఠాత్మక అవార్డు సొంతం చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి.. ఏ విభాగంలో అంటే?

సినిమా రంగంలో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే 2024 (IIFA) ఐఫా వేడుకలు (IIFA Utsavam 2024) అబుదాబిలో అట్టహాసంగా జరుగుతోంది. బాలీవుడ్తో పాటు ఇతర సినీ ఇండస్ట్రీ నుంచి పలువురు స్టార్స్ ఈ వేడుకకు హాజరై సందడి చేశారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్​ నుంచి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా సతీమణితో కలిసి హాజరయ్యారు. ఇందులో భాగంగానే ప్రతిష్టాత్మక 'ఔట్ స్టాండింగ్ అచీవ్‌మెంట్ ఇన్ ఇండియన్ సినిమా' పురస్కారాన్ని స్టార్ హీరోస్ బాలకృష్ణ -వెంకటేశ్ చేతుల మీదుగా అందుకున్నారు. అయితే, ఈ వేడుకలో చిరంజీవిని బాలయ్య బాబు హాగ్ చేసుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో మెగా-నందమూరి ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

Also Read :- ఎన్టీఆర్ వన్‌‌‌‌ మ్యాన్ షో..కొన్ని సీన్స్ గూజ్ బంప్స్

ఇటీవలే చిరంజీవి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఆయన సినీ కెరీర్ లో 156 సినిమాలుకు గాను, 537 పాటలు 24వేల స్టెప్పులతో అభిమానులను అలరించినందుకు గిన్నిస్ బుక్ లో ఆయన పేరును లిఖించబడింది.

ఇపుడు తాజాగా చిరంజీవి మరోసారి ఔట్ స్టాండింగ్ అఛీవ్ మెంట్ ఇన్ ఇండియన్ సినిమా పురస్కారంతో ఐఫా ఆయన్ను సత్కరించింది.దీంతో మెగాస్టార్ చిరంజీవికి సోషల్ మీడియాలో సినీ రాజకీయ ప్రముఖుల నుంచి విషెష్ అందుతున్నాయి.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by IIFA Utsavam (@iifautsavam)