బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్' సినిమా సక్సెస్ మీట్ జనవరి 17న నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (SS Thaman) మాట్లాడిన ఎమోషన్ స్పీచ్ అందరినీ ఆలోచింపజేస్తోంది.
తెలుగు సినిమాలకు సంబంధించిన ట్రోలింగ్ చూస్తుంటే భయంగా ఉందని అదే సమయంలో సిగ్గుగా కూడా ఉందని తమన్ మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. తమన్ స్టేజిపై మాట్లాడిన మాటలు నన్నెంతో కదిలించాయని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) X ద్వారా ట్వీట్ చేశారు.
"నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది. విషయం సినిమా అయిన, క్రికెట్ అయిన, మరో సామజిక సమస్య ఏదైనా.. సోషల్ మీడియా వాడుతున్న ప్రతి ఒక్కరు తమ మాటల తాలూకు ప్రభావం ఆ వ్యక్తుల మీద ఎలా వుంటుందని ఆలోచించాలి.
ఎవరో అన్నట్టు మాటలు ఫ్రీ నే, మాటలు ప్రేరేపించగలవు. మరియు ఆ మాటలే నాశనం చేయగలవు. కానీ, మీరు ఇందులో ఏమి చేయాలనుకుంటున్నారో ఎంచుకోండి.(Words can inspire. And Words can destroy. Choose what you wish to do) మనం పాజిటివ్గా వుంటే ఆ ఎనర్జీ మన జీవితాలని కూడా అంతే పాజిటివ్గా ముందుకు నడిపిస్తుందని" చిరంజీవి పోస్ట్లో వెల్లడించాడు.
Dear @MusicThaman
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 18, 2025
నిన్న నువ్వు మాట్లాడిన మాటలు హృదయాల్ని తాకేలా ఉన్నాయి. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతూ వుండే నీలో ఇంత ఆవేదన వుండడం నాకు ఒకింత ఆశ్చర్యంగా కూడా అనిపించింది. కానీ మనసు ఎంత కలత చెందితే నువ్వింతగా స్పందించావో అని అనిపించింది.
విషయం సినిమా అయినా క్రికెట్ అయినా
మరో…
థమన్ ఏం మాట్లాడంటే:
థమన్ మాట్లాడుతూ.. సక్సెస్ మనకి చాలా ఎనర్జీని ఇస్తుంది. సక్సెస్ ఉంటే ఏదైనా కొనొచ్చు, నచ్చినట్టు బ్రతుకొచ్చు. అయితే, ఇలాంటి సక్సెస్ కి సోషల్ మీడియా ట్రోల్స్ అడ్డుపడుతున్నాయి. మీరు సినిమాపై పెట్టె నెగిటివ్ ట్రెండ్స్ నిర్మాతని కూల్చేస్తున్నాయి. అంతేకాకుండా నిర్మాత బాగుండాలని సినీ పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరూ, అలాగే అందరి హీరోల ఫ్యాన్స్ కోరుకోవాలని థమన్ అన్నారు.
అయితే, ఇప్పుడు సినిమాలకు సంబంధించిన ట్రోలింగ్ చూస్తుంటే భయంగా ఉందని అదే సమయంలో సిగ్గుగా కూడా ఉందని ఆయన అన్నారు. నెగిటివ్ ట్రోల్స్ వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ పరువు పోతుందని.. థమన్ ప్రతి హీరో ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి ప్రతి హీరో ఫ్యాన్ కి ఎంతో బాధ్యత ఉందన్నారు. దయచేసి తెలుగు సినిమాల మీద నెగిటివిటీని స్ప్రెడ్ చేయొద్దు.. బాలీవుడ్ మలయాళ కన్నడ సినీ పరిశ్రమలకు వెళ్ళినప్పుడు అక్కడివారు ఏదైనా మంచి తెలుగు సినిమా చేయాలని అంటూ ఉంటారని, కానీ మనవాళ్ళకేమో తెలుగు సినిమాలంటే చులకనలా మారిందని అన్నారు.
ఒక్కటి గుర్తుచేసుకోండి.. తెలుగు సినిమాకి ఇతర భాషల్లోనే కాదు ఇతర దేశాల్లో కూడా ఎంతో గౌరవం ఉంది. ఎందుకంటే మన తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. ట్రోల్స్ తో మన పరువుని మనమే తీసుకోవద్దు. సినిమా చాలా గొప్పది.. వ్యక్తిగతంగా ఏమున్నా మీరు మీరూ కొట్టుకు చావండి. కానీ, సినిమాని ఎట్టి పరిస్థితుల్లో చంపేయకండి. ఇది చాలా పెద్ద తప్పు. ఇక ఏ సినిమాకు ఇటువంటి తప్పు జరగకూడదు" అని థమన్ కోరాడు. అయితే, రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమాకు ఎదురైనా ప్రతికూల పరిస్థితులపై థమన్ స్పందించినట్లు తెలుస్తోంది.