ఇటీవలే అకాల వర్షాలు రెండు తెలుగు రాష్టాలను కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలలో తీవ్ర ఆస్తినష్టం జరిగింది. అలాగే వరదలు కారణంగా చాలామంది వసతులు కోల్పోయారు. దీంతో వరద భాదితులను ఆదుకునేందుకు పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు తమ వంతుగా సహాయం అందిస్తూ విరాళాలు ప్రకటిస్తున్నారు.
కాగా తాజాగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా వరద భాదితుల సహాయార్థం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 50 లక్షల రూపాయలు విరాళం ప్రకటించాడు. దీంతో ఈరోజు(సెప్టెంబర్ 16, 2024) తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి రూ. 50 లక్షల విరాళం చెక్ ని అందించాడు. అంతేగాకుండా మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ కూడా రూ. 50 లక్షలు ప్రకటించగా ఈ సందర్భంగా ఈ విరాళం చెక్ ని కూడా అందించాడు. దీంతో రేవంత్ రెడ్డి మెగాస్టార్ ని అభినందించాడు. అలాగే దుశ్శాలువాతో సత్కరించాడు.
ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం చిరంజీవి తెలుగులో ప్రముఖ దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న విశ్వంభర చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. మైథాలజీ బ్యాక్ డ్రాప్ లో దాదాపుగా రూ. 200 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 50 లక్షలు విరాళం అందజేసిన మెగాస్టార్ చిరంజీవి గారు.
— Vamsi Kaka (@vamsikaka) September 16, 2024
రామ్ చరణ్ తరపున మరో 50లక్షలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసిన చిరంజీవి గారు.#Chiranjeevi #RamCharan @KChiruTweets pic.twitter.com/0yaKwd5ENa