జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటా.. చిరంజీవి సంచలన ప్రకటన

జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటా.. చిరంజీవి సంచలన ప్రకటన

జీవితాంతం రాజకీయాలకు దూరంగా ఉంటానని మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన చేశారు. ‘‘నో పాలిటిక్స్‌.. ఓన్లీ సినిమా.. జీవితాంతం కళామతల్లి సేవలోనే గడిపేస్తా’’నని అన్నారు.  ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం సినిమా ‘బ్రహ్మా ఆనందం’ ప్రి రిలీజ్ ఈవెంట్‌కు మఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి రాజకీయాలపై క్లారిటీ ఇచ్చారు. 

ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి తదితరులను కలిసిన తర్వాత చిరంజీవిపై రాజకీయంగా విమర్శలు రావడం మొదలయ్యాయి. రాజకీయంగా పదవుల కోసమే చిరు కలుస్తున్నారని కొందరు విమర్శించారు. 

ALSO READ | చిరంజీవి రాజకీయాలపై అంబటి సంచలన కామెంట్స్

అయితే ఈ విమ్శలపై చిరంజీవి ఇవాళ (ఫిబ్రవరి 11) క్లారిటీ ఇచ్చారు. ‘‘ఎవరెవరినో కలుస్తున్నాడు.. మళ్లీ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఎస్తాడేమో.. పెద్దలను కలిసేది పాలిటిక్స్ కోసమే అని కొందరు ప్రచారం చేస్తున్నారు.. సినిమా రంగానికి అవసరమైన సహకారం కోసమే కలుస్తున్నాను.  నా లక్ష్యాలు, సేవాభావాన్ని పవన్‌ నెరవేరుస్తార’’ని ఈ సందర్భంగా చిరంజీవి క్లారిటీ ఇచ్చారు.