Chiranjeevi: ఆ డబ్బు తిరిగిచ్చెయ్యండంటూ మెగాస్టార్ సీరియస్.. ఏం జరిగిందంటే..?

Chiranjeevi: ఆ డబ్బు తిరిగిచ్చెయ్యండంటూ మెగాస్టార్ సీరియస్.. ఏం జరిగిందంటే..?

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాల్లో నటిస్తూ తన ఫ్యాన్స్ ని అలరిస్తున్నాడు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటూ అభిమానులకి అందుబాటులో ఉంటున్నాడు.. అయితే ఇటీవలే ఫ్యాన్ మీటింగ్స్ కొందరు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న విషయం చిరు చెవిన పడడడంతో సీరీయస్ అయ్యాడు. దీంతో వెంటనే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సీరియస్ అయ్యాడు.

అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవిని బ్రిటీష్ గవర్నమెంట్ లైఫ్ అఛీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. దీంతో చిరు ఈ అవార్డు కోసం యూకే వెళ్ళాడు. దీంతో కొందరు తనకి తెలియకుండా ఫ్యాన్స్ మీటింగ్స్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తనకి సమాచారం అందిందని తాను ఇలాంటివి అస్సలు ఎంకరేజ్ చెయ్యనని క్లారిటీ ఇచ్చాడు. అలాగే ఎవరి దగ్గరైనా ఇప్పటికే డబ్బు వసూలు చేసి ఉంటే తిరిగి ఇచ్చేయాలని హెచ్చరించాడు. ఫ్యాన్స్ కి తనకి మధ్య ఉన్న బంధం, ఆప్యాయత, వెల కట్టలేనిదని కాబట్టి ఇలా డబ్బు వసూలు చేస్తూ ఆ బంధానికి తూట్లు పొడవద్దని తెలిపాడు.  కానీ తన పేరు మీదుగా డబ్బు వసూలు చేస్తున్న వారి పేర్లని మాత్రం చిరు బయట పెట్టలేదు. 

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ప్రముఖ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్న విశ్వంభర అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా చివరి షూటింగ్ షెడ్యూల్ ఇటీవలే పూర్తయింది. దీంతో  విశ్వంభర ని జూన్ లేదా జులై లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇటీవలే చిరు యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా యాక్షన్న్ & బ్లడ్ అడ్వెంచర్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్నట్లు సమాచారం.