Chiranjeevi: మంత్రి నారా లోకేశ్‌కు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే విషెష్

Chiranjeevi: మంత్రి నారా లోకేశ్‌కు మెగాస్టార్ చిరంజీవి బర్త్డే విషెష్

ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) బర్త్ డే విషెష్ తెలిపారు. ఇవాళ గురువారం (జనవరి 23న) మంత్రి లోకేశ్‌  పుట్టినరోజు సందర్భంగా X వేదికగా చిరు పోస్ట్ పెట్టారు.

" పుట్టినరోజు శుభాకాంక్షలు డియర్ లోకేష్. తెలుగు ప్రజలకు సేవ చేయడానికి, AP అభివృద్ధి కోసం మీరు చేస్తున్న నిర్విరామ కృషి ఎంతో అభినందనీయం. మీరు చేపట్టబోయే ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటున్న !! రాబోయే సంవత్సరం మరింత అద్భుతంగా ఉండాలని" చిరంజీవి నారా లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

అలాగే ఏపీ తెలుగు దేశం పార్టీ నాయకులూ, జనసేన పార్టీ నాయకులు లోకేశ్‌కు బర్త్ డే విషెష్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.