- ఈ ఏడాది చివరన భారత్ లో సమ్మిట్
- వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మోదీ
- ట్విట్టర్ లో ధన్యవాదాలు తెలిపిన మెగాస్టార్
టాకీస్: ఈ ఏడాది చివర్లో నిర్వహించనున్న ‘వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్’(వేవ్స్) అడ్వయిజరీ బోర్డులో తనకు అవకాశం కల్పించినందుకు చిరంజీవి ప్రధాన మంత్రి మోదీకి థ్యాంక్స్ చెప్పారు. భారత్‌ను గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్‌గా మార్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ సమ్మిట్ నిర్వహించనుంది. ఇందుకోసం సలహాలు సూచనలు కోరేందుకు ప్రధాన మంత్రి ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. దీనిపై తాజాగా చిరంజీవి పోస్ట్ పెట్టారు.
Thank you Hon’ble Prime Minister Shri @narendramodi ji for this honor. 🙏🙏
— Chiranjeevi Konidela (@KChiruTweets) February 8, 2025
It was indeed a privilege to be part of the Advisory Board for WAVES ( World Audio Visual Entertainment Summit ) and share my two cents along with other esteemed members.
I have no doubts that #WAVES,… https://t.co/zYxpiWVgli pic.twitter.com/VvFj0XGjzt
మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతోన్న వీడియోను పంచుకున్నారు. అడ్వైజరీ బోర్డ్‌లో భాగం కావడం ఆనందంగా ఉందంటూ మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈ సమావేశంలో అమితాబ్ బచ్చన్, మిథున్ చక్రవర్తి, రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, షారుఖ్‌ఖాన్, ఆమిర్‌ఖాన్, అక్షయ్‌కుమార్, అనిల్‌కపూర్, అనుపమ్ ఖేర్, హేమామాలినీ, దీపికా పదుకొణె తదితరులు పాల్గొన్నారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, ఆనంద్ మహీంద్రా కూడా ఈ సమావేశంలో పాల్గొని సమ్మిట్‌పై వారి అభిప్రాయాలు తెలిపారు.
ALSO READ | రామ్ చరణ్ RC16 టైటిల్ అదేనా.. స్టోరీ కూడా మారిందా.?