Women's day: చేతులు ఎత్తి నమస్కరిస్తూ హీరోయిన్స్ కి విషెస్ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

Women's day: చేతులు ఎత్తి నమస్కరిస్తూ హీరోయిన్స్ కి విషెస్ తెలిపిన మెగాస్టార్ చిరంజీవి

 

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి ఈమధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటున్నాడు. అయితే శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి స్పెషల్ గా విషెష్ తెలియజేశాడు. ఇందులో భాగంగా "నా నిజ జీవితాన్ని,  నా సినీ జీవితాన్ని పంచుకుని నాకు విజయం అందించిన నా హీరోయిన్స్ అందరికీ, యావన్మంది మహిళలకు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. " అని ఎక్స్ లో పేర్కొన్నాడు.

అంతేకాదు అయన సతీమణి కొణిదెల సురేఖతో పాటూ గతంలో తనతో కలసి నటించిన వెటరన్ హీరోయిన్స్ కలసి దిగిన ఫోటోని కూడా షేర్ చేశాడు.. ఈ ఫొటోలో కుష్బూ, మీనా, జయసుధ, సుహాసిని, టబు, నదియా, రాధికా శరత్ కుమార్ తదితరులు ఉన్నారు. దీంతో కొందరు ఫ్యాన్స్ ఈ ఫోటోపై స్పందిస్తూ మహిళల్ని ఎంకరేజ్ చెయ్యడంలో చిరు ఎప్పుడూ ముందుంటాడని రియల్లీ గ్రేట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం చిరు వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇందులో ముఖ్యంగా యంగ్ డైరెక్టర్స్ ఛాన్స్ ఇస్తున్నాడు. ప్రస్తుతం ప్రముఖ డైరెక్టర్ మల్లిడి వశిష్ట డైరెక్ట్ చేస్తున్న విశ్వంభర సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఇటీవలే షూటిగ్ పూర్తి చేసుకుంది. దీంతో సమ్మర్ లో రిలీజ్ కి రెడీ గా ఉంది. ఇక దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమా యాక్షన్ థ్రిల్లర్ బ్యాక్ డ్రాప్ లో ఉండనుంది. ఈ ఏడాది "సంక్రాంతికి వస్తున్నాం" సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మరో స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న సినిమాలో నటించేందుకు ఒకే చెప్పాడు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి.