Vishwambhara: హనుమాన్ జయంతి స్పెషల్.. ‘విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

Vishwambhara: హనుమాన్ జయంతి స్పెషల్.. ‘విశ్వంభర’ ఫస్ట్ సింగిల్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘విశ్వంభర’ (Vishwambhara). ‘బింబిసార’ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నాడు. హనుమాన్ జయంతి (2025 ఏప్రిల్ 12) సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.

కీరవాణి స్వరపరిచిన ‘రామ... రామ...’(Raama Raama) పాట మనసుల్ని హత్తుకునేలా ఉంది. ఈ పాటకి 'సరస్వతీపుత్ర' రామజోగయ్య శాస్త్రి అద్భుతమైన సాహిత్యం అందించారు. శంకర్ మహదేవన్, లిప్సిక పాడారు.

'తయ్యతక్క తక్కధిమి చెక్కభజనాలాడి..రాములోరి గొప్ప చెప్పుకుందామా..'నీ గొంతు కలిపి మా వంత పాడగ.. రావయ్య అంజని హనుమా..' వంటి పదాలను రామజోగయ్య శాస్త్రి చక్కగా పొందుపరిచారు. రామ నామం అంటూ సాగుతున్న ఈ భక్తిరస గీతాన్ని విని తరించండి. 

2005 లో రిలీజైన జై చిరంజీవ మూవీలోని 'జై జై గణేశా'..పాట వినాయకుడి మండపాల్లో ఇప్పటికీ వినిపిస్తుంటుంది. ఈ ‘రామ... రామ..’ పాట సైతం హనుమాన్ జయంతి వేడుకల్లో మ్రోగేలా ఉంది.

‘విశ్వంభర’విషయానికి వస్తే.. 

ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. దాదాపు రూ.150 కోట్ల భారీ బడ్జెట్తో సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్తో రానున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టుగానే గ్రాఫిక్స్‌‌ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

‘విశ్వంభర’నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్కు బాగా నెగిటివి వచ్చింది. VFX చాలా పూర్గా ఉందని నెటిజన్స్ విమర్శించారు. ఇక ఆ విషయాలన్నీ దృష్టిలో ఉంచుకుని, బెస్ట్ ఇవ్వడానికి ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు మేకర్స్.

ఈ పలు కారణాల చేత సంక్రాంతికే రిలీజ్ కావాల్సిన, ఈ సినిమాను జూలై 24న విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇందులో చిరంజీవి సరసన త్రిష హీరోయిన్‍గా నటిస్తున్నారు. అషిక రంగనాథ్, ఇషా చావ్లా, రమ్య, కునాల్ కపూర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.