మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మరో సినిమాను లైన్లో పెట్టేశాడు. చిరంజీవి నటించే కొత్త మూవీని త్వరలో ప్రకటించబోతున్నారు. ఎన్నో హిట్ చిత్రాలకు స్క్రీన్ రైటర్, డైలాగ్ రైటర్ గా పనిచేసిన బి.వి.ఎస్ రవి (BVSN Ravi) రెడీ చేసిన స్టోరీలో చిరు నటించబోతున్నట్లు సమాచారం.
బి.వి.ఎస్ రవి చెప్పిన కథ చిరంజీవికి బాగా నచ్చిందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, మెగా డాటర్ సుస్మిత కొణెదల హౌస్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్స్పై సంయుక్తంగా నిర్మిస్తున్నట్లు టాక్. ఇక ఈ మూవీని హరీష్ శంకర్ (Harish Shankar) డైరెక్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం హరీష్ శంకర్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో హీరో రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే మూవీ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా ఆగస్ట్ 15న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ బచ్చన్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో సినిమా గురించి హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు.
చిరంజీవికి కథ చెప్పడం జరిగిందని..ఆ స్టోరీ కూడా మెగాస్టార్ కి బాగా నచ్చిందని..త్వరలో మా ఇద్దరి కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ ఉంటుందని హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చారు. అయితే ఆ మూవీ ఎప్పుడుంటుందనేది చిరంజీవి నేరుగా ప్రకటిస్తారని అన్నారు.
ఇండస్ట్రీకి ‘గబ్బర్ సింగ్’ వంటి సూపర్ హిట్‌ను అందించిన హరీశ్ శంకర్ దర్శకత్వంలో చిరు నటిస్తున్నాడనే వార్తా ఎప్పటినుంచో వస్తున్నప్పటికీ..ప్రస్తుతం మరోసారి వైరల్ అవుతుంది. మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయ్యాక, హరీష్ శంకర్ ఉస్తాద్ సెట్లో జాయిన్ అవ్వబోతున్నట్లు సమాచారం. ఇక అప్పటిలోపు చిరంజీవి విశ్వంభర మూవీ కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. మరి హరీష్ శంకర్ మ్యానరిజమ్కి చిరు మెగా ఇజమ్ తోడైతే..బాక్సాఫీస్ లెక్కలు లెక్కేట్టాల్సిందే!