
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లోని ఓ స్కూల్ లో జరిగిన అగ్నిప్రడంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మార్క్ శంకర్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి మార్క్ శంకర్ ఆరోగ్యంపై కీలక ట్వీట్ చేశారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు చిరంజీవి. ఒకరకంగా ఇది మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
మార్క్ శంకర్ ఇంటికొచ్చేశాడు.. అయితే అతను ఇంకా కోలుకోవాల్సి ఉందని అన్నారు మెగాస్టార్. మా కుల దైవం ఆంజనేయస్వామి దయతో తావరలోనే పూర్తి ఆరోగ్యంతో ఎప్పటిలాగే ఉంటాడని అన్నారు. ఆంజనేయ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి మా బిడ్డను కాపాడాడని.. మార్క్ శంకర్ కోలుకోవాలని ప్రతి ఒక్కరూ మా కుటుంబానికి అండగా నిలబడ్డారని అన్నారు చిరంజీవి. నా తరఫున, పవన్ కల్యాణ్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నామంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు చిరంజీవి.
మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే వుంటాడు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) April 10, 2025
రేపు హనుమత్ జయంతి, ఆ స్వామి ఓ పెద్ద ప్రమాదం నుంచి, ఓ విషాదం నుంచి ఆ పసి బిడ్డని కాపాడి మాకు అండగా… pic.twitter.com/nEcWQEj92v
మంగళవారం ( ఏప్రిల్ 8 ) మార్క్ శంకర్ ఉన్న స్కూల్ లో అగ్నిప్రమాదం జరిగింది..ఈ ఘటనపై అటు సెలెబ్రిటీలు, రాజకీయ ప్రముఖులు తమ సానుభూతి వ్యక్తం చేశారు. కొడుకు గాయపడ్డ విషయం తెలుసుకున్న వెంటనే మెగా ఫ్యామిలీతో కలిసి సింగపూర్ వెళ్లారు పవన్ కళ్యాణ్.