
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) పుట్టినరోజు (మార్చి 27న) సందర్భంగా సినీ ప్రముఖుల నుంచి విషెష్ అందుతున్నాయి. ఈ క్రమంలో తన తనయుడు, నటుడు రామ్‌చరణ్ పుట్టినరోజును పురస్కరించుకొని ప్రత్యేకంగా విషెస్ తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.
‘‘హ్యాపీ బర్త్‌డే మై డియర్ చరణ్. ‘పెద్ది’టైటిల్ రోల్లో చాలా ఇంటెన్స్‌గా కనిపిస్తున్నావు. నీలోని నటుడిని మరో కొత్త కోణంలో ఇది ఆవిష్కరించనుంది. అభిమానులకు, సినిమా ప్రేమికులకు ఇది కన్నుల పండుగ కానుందని నమ్ముతున్నా’’ అని X వేదికగా పంచుకున్నారు.
బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న రామ్‌చరణ్ మూవీకి పెద్ది అనే టైటిల్‌ను మేకర్స్ కన్ఫామ్ చేశారు. అలాగే చరణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. ఇందులో రామ్ చరణ్ మాస్ లుక్‌లో రా అండ్ రస్టిక్గా కనిపిస్తున్నాడు. ముక్కుకు పోగు, పొడవైన గడ్డంతో బీడీ వెలిగిస్తూ కొత్త లుక్లో దర్శనం ఇచ్చాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. దాంతో మెగా అభిమానులు చరణ్కు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
— Chiranjeevi Konidela (@KChiruTweets) March 27, 2025
రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోన్న పెద్ది మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ప్రస్తుతం హైదరాబాద్లో కీలక సన్నివేశాలను బుచ్చిబాబు షూట్ చేస్తున్నారు. రామ్‌చరణ్, శివకుమార్‌కుమార్‌తో పాటు మిగతా నటులపై షూటింగ్ జరుగుతుందని సమాచారం. ఆ తర్వాతి షెడ్యూల్ ఢిల్లీలో జరగనున్నట్లు టాక్.
ALSO READ : VeeraDheeraSooran: విక్రమ్ ‘వీర ధీర శూరన్’ X రివ్యూ.. రా అండ్ రస్టిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే?
ఈ మూవీని దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ప్రజెంటర్స్‌గా వ్యవహరిస్తున్నాయి.