విశ్వంభర టీజర్ అదిరిందిగా..

విశ్వంభర టీజర్ అదిరిందిగా..

చిరంజీవి హీరోగా మల్లిడి వశిష్ట దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’. దసరా కానుకగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. భారీ అంచనాలతో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని  యూవీ క్రియేషన్స్ బ్యానర్‌ పై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. త్రిష, ఆశికా రంగనాథ్, కునాల్ కపూర్, మీనాక్షి చౌదరి తదితరులు హీరోయిన్లుగా నటిస్తుండగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇప్పుడు విశ్వంభర ట్రైలర్ విశేషాలేంటో లుక్కేద్దాం... 

మొదటగా సౌర కుటుంబాన్ని చూపిస్తూ అవతార్ లోని పక్షులు, భారీ వీఎఫ్ఎక్స్ సన్నివేశాలతో ట్రైలర్ స్టార్ అవుతుంది. అలాగే వరల్డ్ మిస్టరీ సీక్రెట్ అంటూ ప్రశ్నలు పుట్టించిన కాలమే సంధానం చెబుతుందని బ్యాగ్రౌండ్ వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత తెల్లటి రెక్కల గుర్రంపై మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇస్తాడు. 

టీజర్ లో చిరు డైలాగ్స్ లేకపోయినప్పటికీ ఫైట్స్, విజువల్స్ ఆకట్టుకున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి బిజియంతో అలరించారు. మొత్తానికి దసరా పండగ సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. యాక్షన్ సన్నివేశాలు, వీఎఫ్ఎక్స్ తో ఓవరాల్ గా  టీజర్ ఫర్వాలేదనిపించిందని చెప్పవచ్చు.

ఈ విషయం ఇలా ఉండగా విశ్వంభర చిత్రం వచ్చే ఏడాది  సంక్రాంతి కానుకగా జనవరి 10 న విడుదల చేస్తున్నట్లు గతంలో అధికారికంగా ప్రకటించారు. కానీ అనుకోని కారణాలవల్ల షూటింగ్ పూర్తవకపోవడంతో రిలీజ్ డేట్ ని చేంజ్ చేసుకుని సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. దీంతో సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.