
చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సోషియో ఫాంటసీ ఎంటర్‌టైనర్ రిలీజ్ డేట్‌కు సంబంధించి ఇప్పుడో కొత్త కబురు ప్రచారంలోకి వచ్చింది. జులై 24న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
చిరంజీవి కెరీర్‌లో ఐకానిక్ మూవీగా నిలిచిన ‘ఇంద్ర’ సినిమా ఇదే డేట్‌కు విడుదలైన విషయం తెలిసిందే. సక్సెస్ సెంటిమెంట్ దృష్ట్యా ఇదే డేట్‌కి వస్తే మరో బ్లాక్ బస్టర్ ఖాయమని భావిస్తున్నారు అభిమానులు. షూటింగ్ చివరిదశకు చేరుకున్న ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.
గ్రాఫిక్స్‌కు ప్రాధాన్యత ఉన్న చిత్రం కావడంతో ఆ విషయాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు మేకర్స్. మరోవైపు ప్రమోషన్స్ కూడా ప్రారంభించబోతున్నారు. ఈ నెల పన్నెండున ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కు ముహూర్తం ఖరారు చేసినట్టు సమాచారం. త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆషిక రంగనాథ్, ఇషాచావ్లా, రమ్య, కునాల్ కపూర్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.