రిలీజ్ కి ముందే పవన్ రికార్డులని బ్రేక్ చేసిన మెగాస్టార్ విశ్వంభర

రిలీజ్ కి ముందే పవన్ రికార్డులని బ్రేక్ చేసిన మెగాస్టార్ విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి "విశ్వంభర" చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో చిరుకి జోడీగా త్రిష హీరోయిన్ గా నటిస్తుండగా కునాల్ కపూర్, మీనాక్షీ చౌదరి, ఆషికా రంగనాథ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మల్లిడి విశిష్ట దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే దసరా పండగ సందర్భంగా చిత్ర యూనిట్ 1.32 నిమిషాల నిడివిగల విశ్వంభర టీజర్ ని రిలీజ్ చేశారు.

అయితే విశ్వంభర టీజర్ యూట్యూబ్ లో రికార్డులు బ్రేక్ చేస్తూ టాప్ లో ట్రెండ్ అవుతోంది. టీజర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే 22 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన బ్రో చిత్రం పేరిట ఉన్న రికార్డులను బ్రేక్ చేసింది. బ్రో చిత్రం టీజర్ కి 24 గంటల్లో 20.50 మిలియన్లు వ్యూస్ వచ్చాయి. 

భారీ విఎఫ్ఎక్స్ తో, చిరుకి కనీసం ఒక్క డైలాగ్ కూడా లేకుండా కట్ చేసిన ఈ టీజర్ ఒక్కసారిగా విశ్వంభర చిత్రంపై అంచనాలు పెంచేసింది. అంజి చిత్రంలో నటించిన 24 ఏళ్ల తర్వాత సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో చిరు మళ్ళీ ఇప్పుడు సరికొత్తగా ప్రయోగం చేస్తున్నాడు.

ఈ విషయం ఇలా ఉండగా కొందరు విశ్వంభర టీజర్ లోని విఎఫ్ఎక్స్ పై నెగిటివ్ ట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విశ్వంభర టీజర్ లోని కొన్ని షాట్లు పలు హాలీవుడ్ చిత్రాలలోని సన్నివేశాలని పోలి ఉన్నాయని అంటున్నారు. 

అయితే విశ్వంభర చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 10న విడుదల కావలసి ఉంది. కానీ రిలీజ్ డేట్ ని చేంజ్ చేసుకుని సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. దీంతో సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు చిత్రం యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.