మెగాస్టార్ చిరంజీవి కరోనా బారినపడిన విషయం విధితమే. ఆయనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో కరోనా పరీక్ష చేయించుకున్నారు. ఆ పరీక్షల్లో ఆయనకు కరోనా పాజిటివ్‌గా తేలింది. దాంతో జనవరి 26న తనకు కరోనా సోకినట్లు ఆయన ట్వీట్ చేశారు. అప్పటినుంచి చిరు హోంక్వారంటైన్ లో ఉంటున్నారు.
కాగా.. నేడు చిరంజీవి తల్లి అంజనా దేవి పుట్టినరోజు. ఈ సందర్భంగా చిరు తన తల్లికి శుభాకాంక్షలు తెలిపారు. తాను క్వారంటైన్ అయిన కారణంగా తన తల్లి ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేకపోతున్నానని బాధపడ్డారు. జన్మజన్మలకి ఆమె దీవెనలు కావాలని భగవంతుడిని కోరుకుంటున్నట్లు ఆయన అన్నారు. చివరగా అభినందనలు తెలియజేస్తూ.. చిరంజీవి అని కాకుండా.. తన తల్లి ముద్దుగా పిలుచుకునే శంకరబాబు పేరుతో ముగించడం అందరినీ ఆకట్టుకుంది.
అమ్మా !??
— Chiranjeevi Konidela (@KChiruTweets) January 29, 2022
జన్మదిన శుభాకాంక్షలు ??
క్వరెంటైన్ అయిన కారణంగా నీ ఆశీస్సులు ప్రత్యక్షంగా తీసుకోలేక ఇలా తెలుపుతున్నా..
నీ చల్లని దీవెనలు ఈ జన్మకే కాదు మరు జన్మలకి కూడా కావాలని ఆ భగవంతుడ్ని కోరుకొంటూ ?
అభినందనలతో .... శంకరబాబు pic.twitter.com/DF6FS1eP3p
For More News..
కొత్త డ్యాన్స్ ఛాలెంజ్ స్టార్ట్ చేసిన తమన్నా
‘నాలో నేను’ సినిమాను బ్యాన్ చేయాలె