హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి సహాయనిధికి వరద బాధితుల కోసం విరాళాలు వస్తున్నాయి. సీఎం సహాయనిధికి మేఘా కృష్ణారెడ్డి రూ.5 కోట్లు ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డిని మంగళవారం సెక్రటేరియెట్లో కలిసి చెక్కును అందజేశారు.
అలాగే, సీవై ఐఈఎన్టీ లిమిటెడ్ కంపెనీ యాజమాన్యం రూ.కోటి, లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ రూ. కోటి, మైత్రా ఎనర్జీ గ్రూప్ అండ్ అక్షత్ గ్రీన్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు రూ.కోటి, సినీ నిర్మాత దిల్ రాజు కూడా రూ.25లక్షల విరాళం అందించారు. హైదరాబాద్ రేస్ క్లబ్ కూడా రూ.2 కోట్ల విరాళం అందజేసింది.