ప్రధానిపై గవర్నర్ వివాదాస్పద వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి అహంకారం ఎక్కువ అని మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. రైతు సమస్యలపై చర్చించడానికి రీసెంట్ గా మోడీని కలిశానన్న మాలిక్.. ఆ సమయంలో ప్రధాని చేసిన వ్యాఖ్యలు తనకు నచ్చలేదన్నారు. వివాదాస్పద సాగు చట్టాలపై పోరాడుతున్న రైతుల సమస్యలను మోడీకి నివేదించానన్నారు. కానీ మోడీ సరిగ్గా స్పందించలేదన్నారు. 5 నిమిషాల్లో ఆయనతో తనకు గొడవ అయ్యిందన్నారు. ‘మోడీకి అహంకారం ఎక్కువ. సాగు చట్టాలపై జరుగుతున్న ఉద్యమంలో 500 మంది అన్నదాతలు మృతి చెందారని మోడీకి చెప్పా. దీనికి ఆయన.. వాళ్లు నా కోసం చనిపోయారా’ అంటూ నిర్లక్ష్యంగా బదులిచ్చారని సత్యపాల్ పేర్కొన్నారు. 

మోడీ మాటలు తనను షాక్ కు గురి చేశాయని సత్యపాల్ మాలిక్ అన్నారు. హరియాణాలోని దాద్రీలో జరిగిన ఓ కార్యక్రమంలో హాజరైన ఆయన పైకామెంట్లు చేశారు. మాలిక్ కామెంట్స్ కు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తన అధికార ట్విట్టర్ హ్యాండిల్ లో పోస్టు చేసింది. గవర్నర్ మాటలతో మోడీ వ్యక్తిత్వం ఏంటో బయటపడిందని పేర్కొంది. ఇది ప్రజాస్వామ్యానికి తీవ్ర ఇబ్బందికరమని మండిపడింది. 

మరిన్ని వార్తల కోసం: 

ఏఆర్ రెహ్మాన్కు కాబోయే అల్లుడు ఎవరంటే..?

రిటైర్మెంట్ ప్రకటించిన మహ్మద్ హఫీజ్

కరోనా పోవాలంటే కలసి పోరాడాలె