
హైదరాబాద్ లో వివాహిత ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఏమైందో ఏమో కానీ రంగారెడ్డి జిల్లా అత్తాపూర్ లో ప్రముఖ మెహందీ ఆర్టిస్ట్ పింకీ ఆత్మహత్య చేసుకుంది. తన ఇంట్లో చున్నీతో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న అత్తాపూర్ పోలీసులు.. మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
పింకీకి సంవత్సరం క్రితం అమిష్ లోయా అనే వ్యక్తితో వివాహం అయ్యింది. ఇద్దరి మధ్య తరచు గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. కుటుంబ కలహాల కారణంగానే పింకీ ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. పింకీ ఆత్మహత్యకు తన భర్త వేధింపులు కారణమా లేదా వేరే ఏదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.