జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు PDP మేనిఫెస్టో రిలీజ్ చేసిన మెహబూబా ముఫ్తీ

జమ్మూకాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు PDP మేనిఫెస్టో రిలీజ్ చేసిన మెహబూబా ముఫ్తీ

త్వరలో జమ్మూ కాశ్మీర్ లో జరిగే అసెంబ్లీ ఎన్ని్కల మేనిఫెస్టోను PDP అధినేత, మెహబూబా ముఫ్తీ విడుదల చేశారు. జమ్మూకాశ్మీర్ లో మూడు దశల్లో అసెంబ్లీ ఎలక్షన్లు నిర్వహించాలని ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మెహబూబా  శ్రీనగర్  మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలకు ఏ అజెండా లేదని.. కేవలం సీట్ల పంపకాల కోసమే ఆ పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నాయని ఆమె విమర్శించారు.

PDP అజెండాపై ఆధారపడి మాత్రమే పోటీ చేస్తుందని.. ఓట్ల కోసం, సీట్ల కోసం మా మార్టీ పొత్తు పెట్టుకోదని ముఫ్తీ అన్నారు. PDP అన్ని నియోజకర్గాల్లో పోటీ చేస్తామని తెలిపారు.  కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు కూడా అన్నీ స్థానాల్లో పోటీ చేయాలని ఆమె సూచించారు. కాశ్మీర్ సమస్య పరిష్కారమే మా అజెండా అని ఆమె అన్నారు. అనంతరం పీపుల్స్ డెమెక్రటిక్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు ఆమె. 


పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పిఒకె)లోని హిందూ పుణ్యక్షేత్రమైన శారదా పీఠానికి వెళ్లే మార్గాన్ని తెరవాలని, పాకిస్తాన్‌తో సయోధ్య చర్చలు జరపాలని తమ పార్టీ కోరుకుంటోందని ఆమె అన్నారు. పౌరుల కోసం నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) తెరవడం ద్వారా ప్రజల మధ్య సంబంధాలను మెరుగుపరచాలని ఆమె పిలుపునిచ్చారు.

PDP పార్టీ 2028 వరకు బీజేపీతో పొత్తు పెట్టుకొని అక్కడ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.. 2018 జూన్ లో పిడిపి బిజెపితో పొత్తు నుంచి వైదొలిగింది. ఆ సంవత్సరం నవంబర్‌లో అప్పటి గవర్నర్ సత్యపాల్ మాలిక్ అసెంబ్లీని రద్దు చేశారు. అప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ లేదు. ఇప్పుడు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడానికి  ఎన్నికల కమిషన్ సిద్ధమైంది.