జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నా: ఇల్తిజా ముఫ్తీ

జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో  ఓటమిని అంగీకరిస్తున్నా: ఇల్తిజా ముఫ్తీ

జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమిని అంగీకరించారు.  పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (PDP)  కేవలం ఐదు స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది.  ఈ క్రమంలో  తాను ప్రజల తీర్పును అంగీకరిస్తున్నానని  ఇల్తీజా ముఫ్తీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఎన్నికల  కోసం ప్రచారం చేసినందుకు తన పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రజల తీర్పును నేను అంగీకరిస్తున్నాను. బిజ్‌బెహరాలో ప్రతి ఒక్కరి నుంచి  నాకు లభించిన ప్రేమ, ఆప్యాయత ఎల్లప్పుడూ నాతో ఉంటుంది. ఈ ప్రచారంలో చాలా కష్టపడి పనిచేసిన  PDP కార్యకర్తలకు కృతజ్ఞతలు" అని ముఫ్తీ అన్నారు. 

మరో వైపు జమ్మూ కశ్మీర్లో కాంగ్రెస్ కూటమి భారీ ఆధిక్యంలో 49, బీజేపీ 27,పీడీపీ 5, ఇతరులు 9 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

Also Read : హర్యానాలో ఓట్ల శాతంలో కాంగ్రెస్ హవా