ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్(Bigg boss) ఫేమ్ మెహబూబ్ దిల్ సే(Mehaboob dilse) ఇంట పెళ్లి భాజాలు మోగాయి. తాజాగా మెహబూబ్ తమ్ముడు సుభాన్ షైఖ్(Subhan shaik) పెళ్లి బంధంలోకి అడుగుపెట్టారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లి వేడుకకు.. సినీ ఇండస్ట్రీ నుండి ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ సందర్బంగా తన తమ్ముడు సుభాన్ షైఖ్ ఇంకా తన తండ్రితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు మెహబూబ్. ఈ ఫొటోస్ కు.. "నిఖా ముబారక్ మేరా భాయ్.. నీవు కనే కలలన్నీ నిజం కావాలని, ఆ అల్లా మీ ఇద్దరినీ ఎప్పుడూ కలిసి ఉండేలా చేయాలని కోరుకుంటున్నాను. ఒకరినొకరు అర్థం చేసుకోండి, తోడుగా ఉండండి, సహనం, ఓర్పుతో మసులుకోండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మేరీ భాయ్" అని క్యాప్షన్ ఇచ్చారు. ఇది చూసిన మెహబూబ్ అభిమానులు సుభాన్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ చేస్తున్నారు.