అది సెక్స్ సీన్ కాదు.. మీ ఇంట్లో జరిగితే ఇలానే అంటారా?

అది సెక్స్ సీన్ కాదు.. మీ ఇంట్లో జరిగితే ఇలానే అంటారా?

పంజాబీ బ్యూటీ మెహ్రీన్ పీర్జాదా(Mehreen Pirzada) తాజాగా నటించిన వెబ్ సిరీస్ వివాదానికి దారితీసింది. ఆమె నటించిన లేటెస్ట్ వెబ్ సిరీస్ సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ(Sultan of Delhi). మిలన్ లుత్రియా(Milan lithriya) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సిరీస్‌లో.. తాహిర్ రాజ్ భాసిన్, అనుజ్ శర్మ, మౌని రాయ్, అనుప్రియ గోయెంకా, హర్లీన్ సేథి తదితరులు కీలక పాత్రల్లో కనిపించారు. అర్నాబ్ రే రచించిన సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ: అసెన్షన్ అనే పుస్తకం ఆధారంగా వచ్చిన ఈ గ్యాంగ్‌స్టర్‌ డ్రామా సిరీస్‌ డిస్నీ ప్లస్‌ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది.

Also Read : కమల్ 233 కోసం ఆగిపోయిన సినిమా టైటిల్.. ఫుల్ కిక్కులో ఫ్యాన్స్

అయితే ఈ సిరీస్ లో కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించింది మెహ్రీన్. ఆమె నటించిన కొన్ని సీన్స్ పై నెటిజన్లు ట్రోల్స్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఈ సిరీస్ లో మెహ్రీన్, తన భర్త మధ్య మొదటిరాత్రి సందర్బంగా వచ్చే సీన్స్ పై దారుణంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. తాజాగా తనపై వస్తున్న ఈ ట్రోలింగ్ పై స్పదించారు మెహ్రీన్.   

ఈ మధ్యే నేను సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ అనే ఓ వెబ్ సిరీస్ నటించాను. నా అభిమానులకు ఆ సిరీస్ నచ్చిందని అనుకుంటున్నాను. కొన్నిసార్లు కథను బట్టి మన విలువలకు విరుద్థంగా నటించాల్సి ఉంటుంది. అలాంటి సీన్ ఒకటి సుల్తాన్ ఆఫ్ ఢిల్లీలో ఉంది. అది ఇద్దరికీ పెళ్లి జరిగిన తరువాత జరిగే రేప్ ను సూచిస్తుంది. అది దారుణమైన పని. కానీ దాన్ని కూడా కొంతమంది సెక్స్ సీన్లుగా అభివర్ణిస్తున్నారు. అది  చాలా బాధగా ఉంది. అలాంటి పరిస్థితి వాళ్ల అక్కచెల్లెళ్లు, కూతుళ్లకు వస్తే ఇలాగే చేస్తారా? అలాంటి దారుణమైన పరిస్థితి వారికి రావద్దని నేను కోరుకుంటున్నాను.. అంటూ పోస్ట్ చేశారు మెహరీన్. ప్రస్తుతం మెహరీన్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.