బెల్జియంలో చోక్సీ అరెస్ట్.. స్విట్జర్లాండ్కు పారిపోయేందుకు ప్లాన్.. అరెస్ట్ చేసి జైలుకు తరలింపు

బెల్జియంలో చోక్సీ అరెస్ట్.. స్విట్జర్లాండ్కు పారిపోయేందుకు ప్లాన్.. అరెస్ట్ చేసి జైలుకు తరలింపు
  • హాస్పిటల్లో ఉండగా అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • బ్లడ్ క్యాన్సర్కు ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు గుర్తింపు
  • స్విట్జర్లాండ్కు పారిపోయేందుకు ప్లాన్.. అరెస్ట్ చేసి జైలుకు తరలింపు
  • పీఎన్​బీని రూ.13 వేల కోట్లకు పైగా మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు

న్యూఢిల్లీ: ప్రముఖ వజ్రాల వ్యాపారి, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసగించిన కేసులో నిందితుడు మెహుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చోక్సీని బెల్జియం పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. బ్లడ్ క్యాన్సర్​తో బాధపడుతున్న చోక్సీ.. హాస్పిటల్​లో ట్రీట్​మెంట్ తీసుకుంటున్న టైమ్​లోనే శనివారం అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు. ఈ విషయాన్ని అక్కడి న్యాయ శాఖ ధ్రువీకరించింది. అతన్ని ఇండియాకు అప్పగించాలన్న అభ్యర్థనను పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేసింది.

మెహుల్ను విచారిస్తున్నామని తెలిపింది. రెసిడెన్సీ కార్డు పొందేందుకు తప్పుడు పత్రాలు సమర్పించాడన్న ఆరోపణలు కూడా ఆయనపై ఉన్నాయని వివరించింది. సీబీఐ, ఈడీ అధికారులు సమర్పించిన పత్రాలు కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పింది. న్యాయపరమైన నిబంధనల మేరకు ఇంతకంటే ఎక్కువ సమాచారం తాము వెల్లడించలేమని స్పష్టం చేసింది.
.
కొన్నేండ్లుగా చోక్సీపై సీబీఐ, ఈడీ నిఘా
కొన్నేండ్లుగా మెహుల్ చోక్సీ కదలికలపై మన సీబీఐ, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టరేట్ అధికారులు నిఘా ఉంచారు. బెల్జియంలో ఉన్నట్లు గుర్తించిన అధికారులు.. అక్కడి ఏజెన్సీలను అలర్ట్ చేశారు. అతడి నేరాలకు సంబంధించిన కీలక పత్రాలు, సమాచారాన్ని అక్కడి దర్యాప్తు బృందాలకు అందజేశారు. బెల్జియం నుంచి స్విట్జర్లాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పారిపోయేందుకు ప్లాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తున్నట్లు గుర్తించిన అక్కడి పోలీసులు.. శనివారం అరెస్టు చేశారు. 

కాగా, పంజాబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేషనల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను దాదాపు రూ.13 వేల కోట్లకు పైగా మోసం చేశాడని 2018లో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. దీంతో చోక్సీ.. అతడి మేనల్లుడు, ఈ కేసులో ప్రధాన నిందితుడైన నీరవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోదీ దేశం విడిచి పారిపోయారు. చోక్సీ ఆంటిగ్వా కు పారిపోగా.. నీరవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మోదీ లండన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఆశ్రయం పొందాడు. వీరిద్దరిని ఇండియాకు రప్పించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, పీఎన్​బీ స్కామ్​లో చోక్సీని ‘పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడు’గా ప్రకటించాలన్న ఈడీ పిటిషన్.. బాంబే కోర్టులో ఏడేండ్లుగా పెండింగ్​లో ఉన్నది.

ఆంట్వెర్ఫ్లో మకాం
చోక్సీ భార్య ప్రీతీ.. బెల్జియం పౌరురాలు. ఈ క్రమంలో అక్కడ రెసిడెన్సీ కార్డు పొందేందుకు చోక్సీ తప్పుడు పత్రాలను సమర్పించినట్లు అధికారులు గుర్తించా రు. అతడికి ఇండియా, అంటిగ్వా సిటిజన్​షిప్​లు ఉన్న విషయాన్ని దాచిపెట్టాడు. మెహుల్ తన భార్య ప్రీతీతో కలిసి ఆంట్వెర్ఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటున్నాడు. అక్కడ ఎఫ్ రెసిడెన్సీ కార్డు పొందినట్లు తెలుస్తున్నది. బ్లడ్ క్యాన్సర్ ట్రీట్​మెంట్ కోసమే బెల్జియానికి మకాం మార్చినట్లు చెప్పాడు. మెహుల్ అరెస్ట్​ను అతడి తరఫు లాయర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అగర్వాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్ఫర్మ్​ చేశాడు. ఇండియాకు తీసుకొచ్చేందుకు సీబీఐ, ఈడీ ఆఫీసర్లు ప్రయత్నిస్తుంటే.. చోక్సీ లీగల్ టీమ్ మాత్రం ఏదో ఒక సాకుతో అడ్డుకుంటున్నది.